![]() |
![]() |

వందేమాతరం శ్రీనివాస్.. ఈ పేరుకి, తెలుగు చిత్ర సీమకి ఉన్న బంధం నాలుగు దశాబ్దాలపైనే. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో సింగర్ గా, సంగీత దర్శకుడిగా సుమారు 275 సినిమాలకి పైగా పని చేసారు. ఇప్పుడు తన కుటుంబం నుండి ఒక కొత్త తరాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ వారసుడిగా ఆయన కుమారుడు 'సుస్వర తరంగ్' హీరోగా పరిచయం అవుతున్నారు.
సదరు చిత్రం నిన్న గురువారం నాడు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా, సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సరికొత్త కథాంశంతో, నేటి తరం యువత ఆలోచనని, వారి మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిస్తున్నారు. సమాజంలో జరిగే యథార్థ సంఘటనల ఆధారంగా ఒక అద్భుతమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వీరేష్ కోకా ఈ కథని సిద్ధం చేశారు. సురవి విజన్స్ పతాకంపై పి. చక్రధర రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 'కాటమరాయుడు' ఫేమ్ ప్రముఖ దర్శకుడు కిషోర్ కుమార్ (డాలీ) ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ కెమెరా స్విచ్చాన్ చేయగా ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి చిత్ర యూనిట్‌కి స్క్రిప్ట్ అందజేశారు. దివ్యాని మొండల్' హీరోయిన్ గా చేస్తుంది. ఈమె ప్రముఖ బెంగాలీ నటి. జీ లో టెలికాస్ట్ అయిన ఫుల్కి సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది.
Also read: shruti Haasan: శృతిహాసన్ ఈ వ్యక్తితోనే కొత్తగా రిలేషన్ లో అడుగుపెట్టింది..రూమర్స్ కి చెక్
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, "నేను ఇండస్ట్రీలో 275 కంటే ఎక్కువ సినిమాలకి పనిచేశాను. తెలుగు ప్రేక్షకులు నాపై ఎనలేని ప్రేమ, ఆప్యాయతలను చూపించారు. ఇప్పుడు నా కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రేక్షకులు నాపై చూపించిన అదే ప్రేమాభిమానాలను, ఆశీస్సులను నా కుమారుడిపై కూడా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు. జూన్ 29 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ మరియు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. ఎస్. చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బిబిన్ అశోక్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
![]() |
![]() |