![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజా చిత్రం 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్ ఎన్నో మధురమైన, సరదా క్షణాలకు వేదికైంది. ఈ వేడుకలో రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లీంకార (Klin Kaara) గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.
స్టేజ్ పై రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'పెద్ది' సినిమా ప్రభావం థియేటర్లలోనే కాదు, తన ఇంట్లో కూడా గట్టిగానే పడిందని నవ్వుతూ చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి తన ఇంట్లో సరికొత్త మార్పులు వచ్చాయంటూ చరణ్ పంచుకున్న విశేషాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తన బుడ్డది క్లీంకారకు సంబంధించిన ఒక క్యూట్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్‌ను చరణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "మా ఇంట్లో నేనే స్వయంగా అనుభవించాను. నా కూతురు క్లీంకార.. 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నన్ను 'నాన్న నాన్న' అని పిలిచేది. కానీ సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది" అని చరణ్ అన్నారు.
"ఇప్పుడు తను నన్ను చూసి 'ఏయ్ పెద్ది' అని పిలుస్తోంది. అలా పిలవద్దమ్మా నేను నాన్నని కదా అని చెబితే.. సర్లే అని 'ఏయ్ పెద్ది నాన్న' అంటోంది" అంటూ చరణ్ నవ్వుతూ చెప్పారు. దీంతో క్లీంకార అసలు తన పేరునే మర్చిపోయిందని, ఇప్పుడు అందరికీ కేవలం 'పెద్ది' మాత్రమే గుర్తోస్తోందని చరణ్ చమత్కరించారు.
రామ్ చరణ్ ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు స్టేజ్ కింద కూర్చున్న మెగాస్టార్ చిరంజీవి ముఖంలో మురిపెం, పెద్ద నవ్వు కనిపించాయి. తాతగా చిరు కూడా క్లీంకార ముద్దు ముద్దు మాటలను తలచుకుని తెగ ఆనందించారు. చరణ్ తన కూతురి గురించి చెప్పిన ఈ క్యూట్ అండ్ వైరల్ మూమెంట్ అక్కడున్న ఆడియన్స్‌కు కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ తెగ ట్రెండ్ అవుతోంది. 'పెద్ది' క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి క్లీంకార రియాక్షనే నిదర్శనమంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఈ బంధం, చరణ్ ముద్దుగా చెప్పిన విధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
![]() |
![]() |