![]() |
![]() |

నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(MOhan Babu)కి తెలుగు సినిమాకి మధ్య ఉన్న అనుబంధం తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు కూడా. నటన సైతం సలాం కొట్టే సత్తా మోహన్ బాబు సొంతం. ఈ విషయంలో ఏ కొత్త సినీ యవ్వన ప్రేమికుడుకి డౌట్ ఉన్న అందుబాటులో ఉన్న సాంకేతికత ద్వారా తెలుసుకోవచ్చు.
మోహన్ బాబు కొంత గ్యాప్ తర్వాత ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న శ్రీనివాస మంగాపురం(srinivasa mangapuram_తో సెల్యులాయిడ్ పై ల్యాండ్ అవుతున్నాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మోహన్ బాబు లాండ్ అవుతున్నాడు అనే కంటే సింహం మళ్ళీ జూలు విదిల్చడానికి రెడీ అవుతుందని అనుకోవచ్చు . ఎందుకంటే నటన కి సంబంధించి ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో అన్ని వేరియేషన్స్ లోను మోహన్ బాబు నటిస్తుంటే అంత కంటే భాగ్యం ఉండదు. ఇప్పటి వరకు వచ్చిన శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ చూస్తుంటే మళ్ళీ ఆ భాగ్యం కలగనుందనే విషయం అర్ధమవుతుంది. శ్రీనివాస మంగాపురం నుంచి మోహన్ బాబు కి సంబంధించి సరికొత్త సినీ అధ్యాయం స్టార్ట్ కాబోతుందని అంటున్నారు.
Also read: టీనేజ్ గ్యాంగ్ కి టెంపర్ లేపే OTT సిరీస్ వచ్చేసింది.. ఒక్కో సీన్ ఒక్కో అద్భుతం
శ్రీనివాస మంగాపురం జులై 9 న రిలీజ్ కాబోతుండగా వెంకటప్పయ్య నాయుడు క్యారక్టర్ లో మోహన్ బాబు కనిపిస్తున్నాడు.
![]() |
![]() |