Home  »  News  »  ఆ డిజాస్టర్ మూవీ చూడలేదు.. అయితే 12000 చెల్లించాల్సిందేనని కోర్టు సంచలన తీర్పు 

Updated : Jun 23, 2026

 

అభిమాన హీరో మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. దీంతో ఏ అభిమాని అయినా ఏం చేస్తాడు? ముందుగానే ఆన్ లైన్ ఫ్లాట్ ఫార్మ్ లో టికెట్ బుక్ చేసుకొని తన అభిమాన హీరో మూవీ  కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటాడు. కానీ ఇప్పుడు ఆ అభిమాని  తను చూడాలనుకున్న సినిమాపై కేసు వేసి పన్నెండువేల రూపాయల అమౌంట్ గెలిచాడు. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
 

,హైదరాబాద్‌ కి చెందిన ఒక వ్యకి బుక్‌మైషో యాప్ ద్వారా  మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన 'బారోజ్' (Barroz) సినిమా కోసం ఉదయం 10.50 గంటల షోకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఎంతో ఉత్సాహంతో కొత్త సంవత్సరం రోజున కుటుంబంతో కలిసి థియేటర్‌కి చేరుకున్నాడు. కానీ అక్కడ ఒక పెద్ద షాక్ తగిలింది. తాను బుక్ చేసుకున్న 'బారోజ్' సినిమా స్క్రీనింగ్‌ ని యాజమాన్యం రద్దు చేసి, దాని స్థానంలో వేరే సినిమాని ప్రదర్శిస్తున్నట్లు గమనించాడు .

కొత్త షో గురించి బుక్‌మైషో కానీ, లేదా సదరు థియేటర్ యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి మెసేజ్ రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సదరు సినీ ప్రియడు   హైదరాబాద్ వినియోగదారుల కమిషన్‌ని ఆశ్రయించాడు. కోర్టులో బుక్‌మైషో తరపు న్యాయవాదులు వాదిస్తూ, తాము కేవలం ప్రేక్షకులకి, థియేటర్ నిర్వాహకులకి  మధ్య ఒక మధ్యవర్తిగా మాత్రమే ఉన్నాం. షోల రద్దు, సమయాల మార్పుల వంటి నిర్ణయాలు పూర్తిగా థియేటర్ యాజమాన్యానివే. ఇందులో తమ తప్పు ఏమీ లేదు. కస్టమర్ చెల్లించిన టికెట్ మొత్తం 207.14 పైసలని  మరుసటి రోజే రీఫండ్ చేసాం. కాబట్టి తాము బాధ్యులం కాదని వాదించారు. అయితే ఈ వాదనలను వినియోగదారుల కమిషన్ పూర్తిగా తోసిపుచ్చింది.

Also read: Maa inti bangaram: సమంత పెర్ఫార్మ్ అదిరింది.. కానీ 


కమిషన్ తన తీర్పులో స్పష్టం చేస్తూ, ఒకసారి తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా టికెట్లు విక్రయించిన తర్వాత  షో రద్దయినప్పుడు వినియోగదారులకి సకాలంలో అప్‌డేట్స్ అందించడం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కనీస బాధ్యత. కేవలం టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తే సరిపోదు. కస్టమర్ యొక్క విలువైన సమయం వృధా అవ్వడంతో పాటు మానసిక వేదనకి  గురయ్యాడని కోర్టు గుర్తించింది. దీంతో  బుక్‌మైషోకి 10,000 నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 2,000  కస్టమర్ కి చెల్లించాలని  ఆదేశించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిజాస్టర్ సినిమా చూడకపోయింది కాక హైదరాబాద్ వాసి 12000 గెలుచుకున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.  'బారోజ్'  ,మూవీ ప్లాప్ గా నిలిచింది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.