![]() |
![]() |

సెల్యులాయిడ్ పై ఇద్దరు స్టార్ హీరోల మధ్య లేదా ఇద్దరు అగ్ర దర్శకుల మధ్య జరిగే పోటీ ఇచ్చే మజాని మించిన మజా సినీ ప్రేమికులకి మరొకటి ఉండదు. కానీ ఈసారి అంతకి మించిన మజాని ఇచ్చే బాక్సాఫీస్ సమరం జరగబోతోంది. పైగా నిజజీవితంలోని భార్యాభర్తల మధ్యే ఈ థియేట్రికల్ ఫైట్ జరగబోతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ క్యూట్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు ఈ ఆగస్ట్‌లో బాక్సాఫీస్ వద్ద నేరుగా తలపడనున్నారు. ఈ ఇద్దరి స్టార్స్ చిత్రాలు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రాబోతుండటంతో అభిమానుల్లో సరికొత్త ఉత్కంఠ మొదలైంది.
కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్-ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'టాక్సిక్' (Toxic: A Fairytale for Grown-Ups). కియారా అద్వానీ హీరోయిన్. ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు 26వ తేదీనప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. టాక్సిక్ విడుదలైన సరిగ్గా రెండు రోజులకు, అంటే ఆగస్టు 28వ తేదీన శుక్రవారం రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) పర్వదినం సందర్భంగా ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'వాన్' (Vvan) విడుదల కాబోతోంది. దీపక్ మిశ్రా దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ కూడా అదే వీకెండ్‌ని టార్గెట్ చేసింది. దీంతో భార్య సినిమా థియేటర్లలో ఉండగానే భర్త సినిమా కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో ఈ రియల్ లైఫ్ జోడీ మధ్య రీల్ లైఫ్ వార్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also read: The paradise: ఆగస్టు, డిసెంబర్ కాదు.. ప్యారడైజ్ రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?
ఆగస్టు చివరి వారం బాక్సాఫీస్ వద్ద ఎంత బిజీగా ఉండబోతోందో చెప్పడానికి ఈ రెండు చిత్రాలే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. శ్రద్ధా కపూర్ నటిస్తున్న 'ఈత' (Eetha) చిత్రంతో పాటు 'ఖోస్లా కా ఘోస్లా 2' కూడా అదే ఆగస్టు 28న విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే 'వాన్' రిలీజ్ డేట్ మార్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

![]() |
![]() |