![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. వెండితెరపై పవన్ కళ్యాణ్‌ను ఒక డైహార్డ్ ఫ్యాన్‌లా సుజీత్ ప్రెజెంట్ చేసిన విధానం, హై-వోల్టేజ్ మాస్ ఎలివేషన్లు థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. 'ఓజీ' సాధించిన భారీ విజయంతో ఈ చిత్ర సీక్వెల్ 'ఓజీ 2'(OG 2)పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌కు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, 'ఓజీ 2' నిర్మాణ భాగస్వామ్యంలో ఊహించని మార్పు చోటుచేసుకోబోతోంది. మొదటి భాగాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' ఈ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు టాలీవుడ్‌కు చెందిన మరో టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ భారీ సీక్వెల్‌లో జాయింట్ పార్ట్‌నర్‌గా చేతులు కలపనుందని ఇండస్ట్రీ టాక్. ఆ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఇక ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు, షూటింగ్ షెడ్యూల్స్ కూడా శరవేగంగా ప్లాన్ చేయబడుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న దర్శకుడు సుజీత్ త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమై, 'ఓజీ 2' ఫైనల్ స్క్రిప్ట్‌కు సంబంధించి తుది చర్చలు జరపనున్నారు. పవన్ కళ్యాణ్ వైపు నుండి కూడా ఈ ప్రాజెక్ట్‌పై పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో మెగా అభిమానుల్లో జోష్ పెరిగింది. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే ‘ఓజీ 2’కి సంబంధించిన అధికారిక ప్రకటనను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ వెంటనే నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు సమాచారం.
ఒకపక్క ప్రొడక్షన్ హ్యాండ్స్ మారుతున్నాయనే వార్తలు గుసగుసలు రేపుతుంటే, మరోపక్క సుజీత్ ఈసారి అంతకుమించిన యాక్షన్ సీక్వెన్సులు, ఊహకందని మాస్ ఎలివేషన్లతో పవన్ కళ్యాణ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌తో పోలిస్తే పార్ట్ 2 రేంజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌గా రాబోతున్న ‘ఓజీ 2’ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
![]() |
![]() |