Home  »  News  »  Naga Durga: ఫోక్ సింగర్ నాగదుర్గకి లక్కీ ఛాన్స్..ఆ అగ్ర నిర్మాతల నుంచి పిలుపు! 

Updated : Jun 19, 2026

హిట్టు,ప్లాపుతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రియదర్శి. కామెడీ రోల్స్ నుండి సీరియస్ క్యారెక్టర్స్ వరకు ప్రతి క్యారక్టర్ లోను మెప్పించే ప్రియదర్శి త్వరలోనే ఒక సరికొత్త క్రేజీ ప్రాజెక్టుతో ముందుకు రాబోతున్నాడు . టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన రెండు అగ్ర నిర్మాణ సంస్థలు సుకుమార్ రైటింగ్స్' 'బన్నీ వాస్ ప్రొడక్షన్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. 

ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన కథానాయికగా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రముఖ యూట్యూబ్ ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గ. 'కాపోళ్ల ఇంటికాడా', 'పేరుగల్ల పెద్దిరెడ్డి', అలాగే 'దారి పొంటొతుండు' వంటి విలక్షణమైన తెలంగాణ జానపద గీతాలతో సోషల్ మీడియాని ఊపేసిన నాగదుర్గకి ఇది కెరీర్ లోనే అతిపెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పాలి. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ, తన అద్భుతమైన నృత్యంతోనూ, గొంతుతోనూ లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ పల్లెటూరి పిల్లకు ఈ టాప్ బ్యానర్ల సినిమాలో అవకాశం రావడం విశేషం. ఇప్పటికే 'కలివి వనం' అనే ఒక విలక్షణమైన ప్రయోగాత్మక చిత్రంలో చేసిన నాగదుర్గ, ఆ తర్వాత తమిళంలో కూడా ఒక క్రేజీ ప్రాజెక్టులో భాగమైంది. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మెయిన్ లీడ్ రోల్‌ను సొంతం చేసుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం.


Also read: Transfer Trimurthulu Movie Review In Telugu: ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ

తెలంగాణ నేటివిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో సహజంగా తెరకెక్కబోతున్న ఈ సరికొత్త సినిమాతో వంశీ రెడ్డి దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల ఎమోషన్స్, మరియు నాగదుర్గ సహజసిద్ధమైన నటన, హావభావాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయని మేకర్స్ భావిస్తున్నారు. యూట్యూబ్‌లో 100 శాతానికి పైగా గ్రామీణ ప్రేక్షకులను అలరించిన ఒక ఫోక్ స్టార్, ఇప్పుడు వెండితెరపై ప్రియదర్శి లాంటి టాలెంటెడ్ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా ఆసక్తికరమైన విషయమే. ఈ సరికొత్త కాంబినేషన్‌కి  సంబంధించిన పూర్తి వివరాలు, టైటిల్ మరియు ఇతర నటీనటుల గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.