![]() |
![]() |
నటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచలే, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, కృష్ణచైతన్య, శ్రీలక్క్ష్మీ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: ఓంప్రకాష్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
కథ: రాజ్ నిడిమోరు
నిర్మాతలు: రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్‌రెడ్డి దువ్యూరు
బ్యానర్: త్రలాల మూవింగ్ పిక్చర్స్
దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి
విడుదల తేదీ: 19.06.26
సినిమా నిడివి: 154.30 నిమిషాలు
సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో గతంలో ‘ఓ బేబీ’ వంటి సూపర్‌హిట్ సినిమా వచ్చింది. ఇప్ప్పుడు వీరిద్దరి కలయికలోనే ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఆ కారణంగానే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మరి ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో సమంత, నందినిరెడ్డి ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగారా? వీరిద్దరికీ ఇది ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్ అనే చెప్పాలి. మరి ఈ కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని మెప్పించగలిగారా? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
కథ:
అది ఒక పల్లెటూరు. అక్కడ రామరాజు(ఆనంద్) అనే పెద్ద మనిషి ఉంటాడు. ఆయన కుమారుడు అనిరుధ్(దిగంత్ మంచలే) ఒక డాక్టర్. అయితే తండ్రికి ఇష్టం లేకపోయినా స్వర్ణ అలియాస్ ఝాన్సీ(సమంత) అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతాడు. మÖడు సంవత్సరాల తర్వాత తన చెల్లెలి ఎంగేజ్‌మెంట్ కోసం భార్యతో కలిసి ఆ ఊరికి వస్తాడు అనిరుధ్. సాధారణంగా పల్లెటూర్లలో ఉండే సాంప్రదాయాలు, ప్రేమలు ఆ కుటుంబంలో కూడా ఉంటాయి. అయితే ఆ కుటుంబంతో స్వర్ణ అంత త్వరగా కలవలేకపోతుంది. అయినా పట్టుదలతో ఏదో ఒక మాయ చేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో కుటుంబం అంతా మరో ఊరిలోని గుడికి వెళ్లినపుడు ఆ ఇంటి అల్లుడిపై పగ పెంచుకున్న కొందరు రౌడీలు ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఎటాక్ చేస్తారు. ఆ సమయంలో ఎంతో చాకచక్యంగా వారందర్నీ ఆ దాడి నుంచి కాపాడుతుంది స్వర్ణ. అప్పటి నుంచి ఆమెను తమ కుటుంబంలో చేర్చుకుంటారు రామరాజు ఫ్యామిలీ.
ఇదిలా ఉంటే.. స్వర్ణ గతం గురించి భర్తతో సహా ఎవరికీ తెలీదు. గత జీవితంలో స్వర్ణను మానసికంగా వేధించిన కరుణ(గుల్షన్ దేవయ్య) మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. ఆమెను చంపాలని మనుషుల్ని పంపిస్తాడు. అందర్నీ ధైర్యంగా ఎదుర్కొంటుంది స్వర్ణ. గత జీవితంలో ఆమె పేరు ఝాన్సీ. ఒక అనాథ అయిన తనను పెళ్లి చేసుకొని ఆమెకు ఒక కుటుంబాన్ని ఇస్తాడు అనిరుధ్. ఇది తెలుసుకున్న కరుణ ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అయితే తను ఉండగా తన కుటుంబానికి ఏమీ అవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది స్వర్ణ. ఆ క్రమంలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంది? గతంలో ఝాన్సీగా ఉండి స్వర్ణగా పేరు మార్చుకోవడానికి కారణం ఏమిటి? పెళ్లికి ముందు ఆమె జీవితంలో ఎలా సాగింది? వంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ అంతా పల్లెటూరు వాతావరణం, పెళ్లికి సంబంధించిన పనులు, కొత్త కోడలు ఆ కుటుంబంతో కలిసి పోయేందుకు చేసే రకరకాల ప్రయత్నాలతో ఎంతో సరదాగా సాగిపోతుంది. ఫస్ట్‌హాఫ్‌లోనే స్వర్ణకు సంబంధించి ఏదో బలమైన గతం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసారు. దానికి తగ్గట్టుగానే ఒక ఫైట్ కూడా ఉంటుంది. ఇంటర్వెల్ టైమ్‌కి స్వర్ణ తన కుటుంబ సభ్యులందరి ముందు తన గతం గురించి చెప్పేస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి కరుణ వల్ల ఆ కుటుంబానికి రాబోయే ఆపద నుంచి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది స్వర్ణ. ఫస్ట్‌హాఫ్ ఎంతో ఆహ్లాదంగా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ వచ్చేసరికి స్వర్ణకు, వారి కుటుంబానికి పెద్ద ప్రమాదంగా మారిన కరుణను ఎదుర్కొనేందుకు చేసే ప్రయత్నాలు ల్యాగ్ అనిపించాయి. అయితే గతంలో నందినిరెడ్డి చేసిన సినిమాలకు, ఈ సినిమాకి చాలా వ్యత్యాసం ఉంది. ఎప్ప్పుడూ కుటుంబంలోని సున్నితమైన అంశాలనే తీసుకునే ఆమె ఈసారి వాటితోపాటు భారీ యాక్షన్ పార్ట్‌ని కూడా తీసుకోవడం విశేషం. దానికి తగ్గట్టుగానే ఏ యాక్షన్ హీరోకి తగ్గకుండా ఫైట్స్ ఇరగదీసింది సమంత. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని అనవసరమైన సీన్స్ తీసేసి కథను కొంత గ్రిప్పింగ్‌గా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.
నటీనటులు:
వన్ మ్యాన్ షో అన్నట్టుగా ఈ సినిమా వన్ ఉమెన్ షో అని చెప్పాలి. కథంతా సమంత చుట్టూనే తిరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఆమె పెర్‌ఫార్మెన్స్ కూడా ఉంది. కామెడీ, ఎమోషనల్ సెంటిమెంట్ సీన్స్‌ను ఎంతో అందంగా పండించారు. అన్నింటినీ మించి యాక్షన్ సీక్వెన్స్‌ల్లో ఎంతో ఎనర్జీ చూపించారు. మిగతా ఆర్టిస్టుల్లో కరుణ పాత్ర పోషించిన గుల్షన్ దేవయ్య కొత్తగా అనిపించాడు. తన డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్‌తో, మేనరిజమ్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. శ్రీలక్క్ష్మీ చేసిన పాత్ర కూడా బాగుంది. ముఖ్యంగా గతంలో ‘చంటబ్బాయ్’లో ఒక పత్రికా ఆఫీస్‌లో ఆమె చెప్పిన కవితలను తనే చదివి వినిపించడం కొత్తగా ఉంది. టీవీ షోలలో ఎంతో అల్లరిగా కనిపించే శ్రీముఖి ఈ సినిమా ఎంతో హుందాగా ఉండే పాత్రలో అందర్నీ మెప్పించింది. చాలా కాలం తర్వాత గౌతమి ఒక గౌరవప్రదమైన పాత్రతో ఆకట్టుకున్నారు. ఆనంద్, దిగంత్ మంచలే తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు:
టెక్నికల్‌గా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఈ సినిమాకి మొదటి ఎస్సెట్‌గా సినిమాటోగ్రఫీ గురించి చెప్ప్పుకోవాలి. పల్లెటూరుని అందంగా చూపించడంలో, యాక్షన్ సీక్వెన్స్‌లలో ఎంతో నైపుణ్యం కనబరిచారు ఓం ప్రకాష్. ఎడిటింగ్ విషయానికి వస్తే.. సెకండాఫ్‌లో కొంత వరకు ట్రిమ్ చేసే అవకాశం ఉంది అనిపిస్తుంది. టోటల్‌గా చెప్పాలంటే ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాగుంది. సంతోష్ నారాయణన్ చేసిన పాటలు సిట్యుయేషన్‌కి తగ్గట్టు బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా బాగున్నాయి. సినిమాకి అవసరమైన మేరకు ప్రతి షాట్‌ను రిచ్ చూపించే ప్రయత్నం చేశారు నిర్మాతలు. ఇక నందినిరెడ్డి గురించి చెప్పాలంటే.. గతంలో ఆమె చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో చేశారు. అయితే తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా తడబడకుండా చెప్పారు. అయితే కొన్ని సాధారణ లాజిక్‌కి కూడా అందని సీన్స్ ఆడియన్స్‌ని కలవరపెట్టిన మాట వాస్తవం.
ప్లస్ పాయింట్స్:
సమంత పెర్‌ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లోని ల్యాగ్
లాజిక్‌లేని కొన్ని సీన్స్
ఫైనల్‌గా చెప్పాలంటే.. ఈమధ్యకాలంలో యాక్షన్ సినిమాలతో విసుగెత్తిన ప్రేక్షకులకు చక్కని కుటుంబ కథతోపాటు యాక్షన్‌ని కూడా మిక్స్ చేసిన ఈ సినిమాను ‘వన్ టైమ్ వాచ్ మూవీ’గా చెప్పొచ్చు
రేటింగ్: 2.75/5
- జి.హరా
![]() |
![]() |