Home  »  News  »  Samantha: ఆ స్టార్ హీరో చేయిపెడితే 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

Updated : Jun 18, 2026

 

స్టార్ యాక్ట్రస్ సమంత(Samantha)రేపు వరల్డ్ వైడ్ గా 'మా ఇంటి బంగారం'(Maa Inti Bangaram)తో మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమయ్యింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కగా ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి . సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే వస్తుంది. 


ప్రమోషన్స్‌లో భాగంగా సమంత ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఒక సినిమాలో కేవలం చేయి పెట్టి నిలబడితే చాలు, ఆ సినిమాకు ఈజీగా 100 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయి. వారికున్న క్రేజ్, స్టార్‌డమ్ మరియు మార్కెట్ వాల్యూ అలాంటిది. కానీ మహిళా ప్రధాన చిత్రాలకి ఆ స్థాయి మార్కెట్ రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కథలో దమ్ముంటేనే ప్రేక్షకులు థియేటర్లకి  వస్తారని స్పష్టం చేశారు.

Also read: vadde naveen: వడ్డే నవీన్ షాకింగ్ ఫుడ్ హ్యాబిట్స్: ఉదయాన్నే తినేది ఏంటో తెలుసా!

అయితే 'మా ఇంటి బంగారం' చిత్రం రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా రిలీజ్‌కు ముందే 100 శాతం పెట్టుబడిని పూర్తిగా రికవరీ చేసుకుందని నిర్మాత హిమాంక్ అధికారికంగా ప్రకటించారు. ఒక ఫీమేల్ లీడ్ మూవీకి రిలీజ్ ముందే పూర్తి బడ్జెట్ రికవరీ కావడం టాలీవుడ్‌లో ఒక బలమైన కమర్షియల్ సిగ్నల్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.