Home  »  News  »  Deewana: దీవాన మూవీ ఫస్ట్ రివ్యూ.. హర్షిత్ రెడ్డి లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్!

Updated : Jun 18, 2026

 

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హ్యాండ్ పడిన మూవీ హిట్ కి దారిని వెతుక్కోవడం ఖాయమనే నానుడి అనాది సినీ ఆచారంగా వస్తుంది. ప్రేక్షకులు కూడా అదే సెంటిమెంట్ ని ఫిక్స్ అయ్యి థియేటర్స్ బాట పట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అదే ఆలోచనతో రేపు రిలీజ్ కాబోతున్న 'దీవానా'ని చూస్తూ ఉన్నారు. 

 'మెయిల్', 'శుభం', 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, ఇప్పుడు 'దీవానా' తో  పూర్తి స్థాయి హీరోగా వస్తున్నాడు. లవ్ ఓరియెంటెడ్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కగా శ్రీకాంత్ సంగీశెట్టి దర్శకుడు. తమిళ భామ  స్నేహా మణిమేగలై హీరోయిన్‌గా పరిచయమవుతోంది. అరహా మీడియా, వి స్టూడియోస్ పతాకాలపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించగా  గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి  సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ సర్కిల్స్ మరియు ప్రీమియర్స్ నుండి అందుతున్న ఫస్ట్ రివ్యూస్ ఆధారంగా ఈ సినిమా విశేషాలు మరియు అంచనాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

'దీవాన' సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో హీరో హర్షిత్ రెడ్డి 'మున్నా' అనే పక్కా ఓల్డ్ సిటీ హైదరాబాద్ కుర్రాడిగా కనిపించనున్నాడు. హైదరాబాద్ స్థానిక లైఫ్ స్టైల్, ఇక్కడి కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో మున్నా పాత్రకు ఉండే యాటిట్యూడ్, రఫ్‌నెస్, మాస్ ఎనర్జీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఎవరి కోసమో లేదా దేని కోసమో 'దీవాన' (పిచ్చివాడు) అవుతారని, ఈ సినిమాలో ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన ఒక సాధారణ కుర్రాడి భావోద్వేగాలను దర్శకుడు ఎంతో సహజంగా ఆవిష్కరించారని టాక్. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరో స్నేహితులుగా నటించిన వారంతా లోకల్ హైదరాబాద్ కుర్రాళ్లు కావడంతో, వారి మధ్య వచ్చే కామెడీ, డైలాగ్స్ పక్కా లోకల్ ఫ్లేవర్‌తో థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమని తెలుస్తోంది.

ఈ సినిమా మేకింగ్ వెనుక చిత్ర యూనిట్ పడిన కష్టం, తీసుకున్న శ్రద్ధ అమోఘం. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండేందుకు ప్రతి షెడ్యూల్ కంటే ముందు భారీగా వర్క్‌షాప్స్ నిర్వహించారు. కేవలం 3 రోజుల షూటింగ్ కోసం ఏకంగా 10 రోజుల పాటు వర్క్‌షాప్స్ చేసి నటీనటులను సన్నద్ధం చేయడం విశేషం. ఈ తీవ్రమైన హోంవర్క్ కారణంగానే సినిమాను ఎలాంటి రీషూట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయగలిగారు. అంతేకాకుండా, సినిమాలోని చాలా భాగం సెట్స్ వేయకుండా హైదరాబాద్‌లోని రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. సన్నివేశాల్లో కనిపించే రద్దీ అంతా షూటింగ్ చూడటానికి వచ్చిన నిజమైన ప్రజలే కావడం విశేషం, ఇది సినిమాకి  మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది.

Also read: VIjay: విజయ్, ఉదయనిధి కలిసి గెలిచారు.. తెరపైకి వచ్చిన సరికొత్త విజయం  

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన హైలైట్ ఏమిటంటే.. దీని ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్. ఇప్పటివరకు తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు చూసినప్పటికీ, 'దీవాన' చిత్రంలో ఒక సరికొత్త ఎమోషనల్ పాయింట్‌ను టచ్ చేశారని, ఆ ట్విస్ట్ ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను టీజర్ లేదా ట్రైలర్‌లో ఎక్కడా రివీల్ చేయకుండా చాలా సస్పెన్స్‌గా ఉంచారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు 'అర్జున్ రెడ్డి' వైబ్స్ వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ, ఆ సినిమాతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం హైదరాబాద్ యాస, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ వల్ల అలా అనిపించవచ్చని హీరో స్పష్టం చేశాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన  అల్లు అరవింద్ సినిమాను ఎంతగానో మెచ్చుకుని, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడానికి ముందుకు రావడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది. 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.