Home  »  News  »  బాలకృష్ణ, కమల్ హాసన్ మధ్య ఉన్న తేడా ఎంతో తెలుసా!

Updated : Jun 17, 2026

 


లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు(singeetham srinivasa rao)గారు ప్రస్తుతం 'సింగ్ గీతం'(Sing Geetham)అనే మూవీతో మరో సారి తన చరిష్మాని చాటుతూ ఉన్నారు. ఎప్పట్నుంచో థియేటర్స్ కి వెళ్లని ఆడవాళ్లు సైతం సింగీతం గారు సృష్టించిన సినీ మాయని చేసేటందుకు క్యూ కడుతున్నారు. దీన్ని బట్టి ఆయన దర్శక మాయాజాలానికి ఉన్న శక్తి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. సింగీతం శ్రీనివాసరావు గారు రీసెంట్ గా  తన సినీ ప్రయాణం గురించి, ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇద్దరు దిగ్గజ నటులైన లోకనాయకుడు కమల్ హాసన్, నందమూరి బాలకృష్ణల నటన శైలి గురించి ఆసక్తికరమైన విషయాన్నీ చెప్పారు .

సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ, కమల్ హాసన్‌తో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు .దాదాపు 45 సంవత్సరాల క్రితమే కమల్ 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ప్రయాణం మొదలైంది. 'సింగ్ గీతం' కథని  కూడా  45 ఏళ్ల క్రితమే కమల్‌కి  వినిపించానని, అయితే కొన్ని కారణాల వల్ల అది అప్పట్లో పట్టాలెక్కలేదు. కమల్  ఒక 'సైంటిఫిక్ యాక్టర్' .ఒక క్యారక్టర్ ఒప్పుకుంటే అందుకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేస్తారు. క్యారక్టర్  స్వభావం, నడిచే తీరు, మాట్లాడే యాస ఇలా 100 శాతం ఆ క్యారెక్టర్‌లో లీనమైపోతాడు. ప్రయోగాల కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి వెనుకాడడు. అందుకే ఆయన భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఎదిగారని కొనియాడారు.


Also read: Fahadh Faasil: ఫహద్ ఫాజిల్‌పై నజ్రియా వ్యాఖ్యలు వైరల్!.. విడిపోతారా, విడిపోరా!

మరోవైపు, నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఆయన పూర్తి భిన్నమైన శైలి కలిగిన నటుడు. బాలకృష్ణది 'ప్యూర్ ఇన్‌స్టింక్ట్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్' .బాలకృష్ణకి  ఒక సీన్ లేదా డైలాగ్ చెబితే, దానిని ఎక్కువగా విశ్లేషించకుండా, డైరెక్టర్ విజన్‌ని  వెంటనే క్యాచ్ చేసి స్పాట్‌లోనే అద్భుతమైన ఎనర్జీతో పెర్ఫార్మ్ చేస్తాడు. ముఖ్యంగా పౌరాణిక, జానపద, సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో బాలకృష్ణ చూపించే హావభావాలు, డైలాగ్ డెలివరీ అమోఘం . 'ఆదిత్య 369' సమయంలో ఆయనతో పనిచేసిన అనుభవాలు మరువలేనివి. కమల్ హాసన్ హోమ్‌వర్క్ చేసి పర్‌ఫెక్షన్‌తో వస్తే, బాలయ్య బాబు మాత్రం కెమెరా ముందుకు రాగానే విశ్వరూపం చూపిస్తారని ఈ ఇద్దరు స్టార్స్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో చక్కగా వివరించారు. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కమల్ హాసన్ తో పుష్పక విమానం,  విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, బాలకృష్ణతో ఆదిత్య 369 , భైరవ ద్వీపం లాంటి చిత్రాలని  సింగీతం తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఒకదాన్ని మించి ఒకటి హిట్.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.