![]() |
![]() |

మెస్మరైజ్ చేసే సంగీతాన్ని అందించడంలో జి.వి. ప్రకాష్ కుమార్(Gv prakash kumar)ఒకరు. ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్ రెహ్మాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, కేవలం తన స్వయంకృషితోనే అటు సంగీత దర్శకుడిగా, ఇటు హీరోగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న ప్రకాష్ కుమార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్‌రామ్‌లతో తెరకెెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోయే అరుదైన గుణం ఆయనది. చదువులకైనా, వైద్యానికైనా ఆపదలో ఉన్నామంటూ నెటిజన్లు ట్యాగ్ చేస్తే చాలు వెంటనే స్పందించి తన వంతు సహాయం అందిస్తుంటారు.
తాజాగా 'Phoenix'అనే ఒక ఎక్స్ నెటిజన్ తన స్నేహితుడికి కోయంబత్తూరులోని పిఎస్‌జి (PSG) హాస్పిటల్‌లో అత్యవసరంగా సర్జరీ జరగాల్సి ఉందని, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామంటూ హాస్పిటల్ బిల్లులని జతచేసి సాయం కోరుతూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌ని చూసిన తోటి నెటిజన్లు జీవీ ప్రకాష్‌కి ట్యాగ్ చేశారు.ఆ అభ్యర్థనని చూసిన వెంటనే సదరు నెటిజన్ అకౌంట్‌కి తక్షణ సహాయంగా 50,000 యూపీఐ (UPI) ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. అంతేకాదు, ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ "ఇది నిజమని నమ్ముతున్నాను" అంటూ ఆయన ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది నిజమని నమ్ముతున్నాను అని ట్వీట్ చెయ్యడానికి కారణం ఉంది.
Also read: Pawan Kalyan: వరంగల్ వాసి నిరంజన్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్.. హైలెట్ ఇదే
గతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఎమోషనల్ డ్రామా ఆడాడు. ఎప్పుడో మరణించిన ఒక వృద్ధురాలి ఫోటోని పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని, ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహించడానికి చేతిలో పైసా లేదంటూ అబద్ధాలు చెప్పాడు. ఈ ట్వీట్ చూసి చలించిపోయిన జీవీ ప్రకాష్.. ఏమాత్రం ఆలోచించకుండా మానవత్వంతో సదరు వ్యక్తి గూగుల్ పే నంబర్‌కి 20,000 పంపించాడు. అయితే, కొద్దిసేపటికే అది ఫేక్ అకౌంట్ అని, ఆ వ్యక్తి ఆడిన కట్టుకథతో తనని బురిడీ కొట్టించాడని జీవీ ప్రకాష్‌కి అర్థమైంది. రీసెంట్ గా జీవి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో 'భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి చేయడం జరిగింది.
![]() |
![]() |