Home  »  News  »  పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్‌బాబు, దిల్ రాజు తప్పుకోవాలి! 

Updated : Jun 16, 2026

"థియేటర్స్‌లో పర్సంటేజ్ విధానం అమలుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారు. అయితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇబ్బందులు తలెత్తని రీతిలో అందరికీ ఆమోదయోగ్యమైన పర్సంటేజ్‌ను నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. రెంటల్ విధానంలో ఒక థియేటర్‌కు రూ. 7,30,000/- వస్తుందనుకుంటే..ఆ థియేటర్ ఓనర్ సుమారు రూ.10,00,000/- వరకు పర్సంటేజ్ విధానంలో వచ్చేవిధంగా నిర్ణయించమని అడగడంలో తప్పులేదు. అదే పాతిక లక్షలకు సమానంగా పర్సంటేజ్ ఇవ్వమని అడిగితే, అది ఎంతమాత్రం సహేతుకంగా ఉండదు. సినిమాలలో నష్టం వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ను ఆదుకునే వారు ఎవరూ లేరు. కొన్ని సందర్భాలలో నష్టాల కారణంగా ఉన్న ఆస్తులు పోగొట్టుకుని, అప్పుల పాలవుతున్నారు. 

అఖండ-2 సినిమాకు నష్టాలు వస్తే  నిర్మాత  గురించి ఎవరు మాట్లాడారు. అలాగే చిన్న సినిమా నిర్మాతలకు  ఇంకెంత ఇబ్బందులు ఉంటాయి. ఎగ్జిబిటర్‌కు తన థియేటర్ అయినా ఒక ప్రాపర్టీగా, సేఫ్టీగా ఉంటుంది. హీరోలు తక్కువ సినిమాలు చేయటం వల్ల ఎగ్జిబిటర్స్ ఇబ్బందులు పడుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ సబ్ కమిటీ మీటింగ్‌లో మాట్లాడేందుకు కొందరు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లే నేను మాట్లాడాల్సి వస్తోంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని, ఇబ్బందులు ఎదురుకాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో నిర్ణయాలు జరగాలి. ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా లీజు ఓనర్స్ అయిన డి.సురేష్ బాబు, దిల్ రాజులు ఉన్నారు. వ్యక్తిగతంగా వారిద్దరూ నాకు ఎంతో క్లోజ్. అయితే ఈ సబ్ కమిటీ వారి నేతృత్వంలో పనిచేస్తుండటం వల్ల వారు ఎగ్జిబిటర్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. 

దానివల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు అన్యాయం జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు నాకే కాదు పలువురు నిర్మాతలకు వస్తున్నాయి. అందుకే వారిద్దరూ ఈ కమిటీ నుంచి తప్పుకుని, వారి స్థానాలలో కె.ఎల్.నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి వంటి వారిని నియమించాలి. వారిద్దరూ కావాలంటే సబ్ కమిటీలో ఎగ్జిబిటర్స్ వైపు నిలబడి మాట్లాడవచ్చు. నిజమైన బి.ఫారం కలిగిన లైసెన్స్ ఉన్న ఓనర్స్ కాకుండా లీజ్ ఓనర్స్ ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. అన్నీ వాళ్లకు అనుకూలమైన, వాళ్లకు భారీ లాభాలు ఉండేలా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కలవరం ఎంతోమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌లో ఏర్పడుతోంది.  ప్రతి ఒక్కరి సమస్యలను సబ్ కమిటీ చర్చించి, శాశ్వతంగా  పరిష్కరించాలి. గతంలో సబ్ కమిటీ మీటింగ్ జరిగాక కూడా ఎగ్జిబిటర్స్ రెండు సార్లు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.