Home  »  News  »  ఆ సూపర్ హిట్ మూవీ కథలు నావే.. మాజీ ఐపీఎస్ అధికారిణి సంచలనం

Updated : Jun 16, 2026

 


సినిమా ఇండస్ట్రీలో కథల దొంగతనం లేదా కాపీరైట్ వివాదాలు కొత్తేమీ కాదు. కానీ, ఈసారి ఏకంగా ఒక మాజీ ఐపీఎస్ అధికారిణి, కేరళ తొలి మహిళా డీజీపీ  ఆర్. శ్రీలేఖ రెండు ప్రముఖ మలయాళ చిత్రాలపై తీవ్రమైన ప్లాజియరిజం (కథల దొంగతనం) ఆరోపణలు చేయడంతో దక్షిణాది సినీ పరిశ్రమలో పెద్ద సంచలనం రేగుతుంది . 


ఇటీవలే విడుదలైన షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన 'దృఢం' సినిమాతో పాటు, గతంలో విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్న 'భూతకాలం' (2022) సినిమా కథలు కూడా తనవేనంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలని  బయటపెట్టారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'దృఢం'   చూసిన తర్వాత ఆమె ఈ విషయాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. తాను సుమారు 15 సంవత్సరాల క్రితం 'మాతృభూమి' వారపత్రికలో రాసిన 'కరింకుడి పోలీస్ స్టేషన్' అనే లఘు కథ (షార్ట్ స్టోరీ) ఆధారంగానే 'దృఢం' సినిమా మూల కథని  రూపొందించారని,అంతేకాకుండా, ఈ కథను 5 సంవత్సరాల క్రితమే తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఆడియో రూపంలో కూడా అప్‌లోడ్ చేశాను. ఒక మారుమూల కొండ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కి  వచ్చే కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్ చుట్టూ, అక్కడ జరిగే వరుస హత్యల చుట్టూ తిరిగే ఈ కథని  ఎలాంటి అనుమతులు లేకుండా సినిమాగా మార్చేశారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై 'దృఢం' చిత్ర దర్శకుడు మార్టిన్ జోసెఫ్ స్పందిస్తూ.. తమ చిత్రానికి శ్రీలేఖ కథకు ఎలాంటి సంబంధం లేదని, రచయితలు జోమోన్ జాన్, లింటో దేవసియా కూడా ఈ వీడియోను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నారని చెబుతున్నారని క్లారిటీ ఇచ్చారు.

ఇక రెండో సినిమా అయిన 'భూతకాలం' గురించి శ్రీలేఖ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. సుమారు 3 సంవత్సరాల క్రితం తన యూట్యూబ్ ఛానల్‌లోనే  తాను స్వయంగా అనుభవించిన ఒక యదార్థ ఉదంతాన్ని 'భూత భవనం' (దెయ్యాల ఇల్లు) అనే పేరుతో కథగా పంచుకున్నానని, ఆ కాన్సెప్ట్‌ను దొంగిలించే 2022లో రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో 'భూతకాలం' తెరకెక్కించారు. చివరికి  టైటిల్‌లో కూడా నా కథా శీర్షిక పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు . ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రెండు చిత్రాల్లోను షేన్ నిగమ్ హీరో.

Also read: ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే

చిత్ర నిర్మాతలు, దర్శకులపై కథల కాపీ ఆరోపణలు చేసినప్పటికీ, నటుడు షేన్ నిగమ్ పట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని శ్రీలేఖ స్పష్టం చేశారు. 2017లో వచ్చిన 'పరవ' సినిమా నుంచే తనకు షేన్ నటన అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా 'దృఢం' సినిమాలో పోలీస్ యూనిఫాంలో చూస్తుంటే గతంలో తనతో కలిసి పనిచేసిన, తాను తమ్ముడిలా భావించే మొహమ్మద్ అనే పోలీస్ అధికారి గుర్తుకు వచ్చాడని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వివాదం మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న తరుణంలో, కథల హక్కులపై జరుగుతున్న ఈ చర్చ ఎటు దారితీస్తుందో చూడాలి.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.