![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. 'బ్లడీ రోమియో' (Bloody Romeo) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమాపై టాలీవుడ్ ఆడియన్స్‌లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. నాని ప్రస్తుతం నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) చిత్ర షూటింగ్ అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం అవుతోందని, ఈ కారణంగానే సుజీత్ తన పూర్తి ఫోకస్‌ను పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సీక్వెల్ 'ఓజీ 2' (OG 2) పైకి షిఫ్ట్ చేశారనే టాక్ బలంగా వినిపించింది. అంతేకాదు, నవంబర్ నెల నుంచే ఈ సీక్వెల్ షూటింగ్ పట్టాలెక్కబోతోందంటూ ఇండస్ట్రీలో ఒక రేంజ్‌లో ప్రచారం కూడా సాగింది.
కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించిన ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ తెరపైకి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, నాని మరియు సుజీత్ కలయికలో రాబోతున్న 'బ్లడీ రోమియో' షూటింగ్ ఆలస్యమంటూ వచ్చిన వార్తలు అన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఎందుకంటే వచ్చే నెలలోనే, అంటే జూలై లోనే ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ చాలా గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ తన కోర్ టీమ్‌తో కలిసి విదేశాల్లో లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కథా నేపథ్యం అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతుండటంతో, లండన్, బుడాపెస్ట్, హంగేరీ వంటి అందమైన మరియు కాస్మోపాలిటన్ నగరాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తవడంతో, విదేశీ షెడ్యూల్స్ కోసం లొకేషన్లను లాక్ చేసే పనిలో సుజీత్ నిమగ్నమై ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్లానింగ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'బ్లడీ రోమియో' సినిమా మొత్తం షూటింగ్‌లో కేవలం 20 శాతం మాత్రమే హైదరాబాద్‌లో జరగబోతోందని సమాచారం. మిగిలిన 80 శాతం భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్ మరియు కీలకమైన డ్రామా సీక్వెన్సులు అన్నీ కూడా లండన్, బుడాపెస్ట్, హంగేరీ దేశాల్లోనే షూట్ చేయనున్నారు. ఈ ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు ఒక సరికొత్త విజువల్ గ్రాండియర్‌ను తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకపక్క నాని 'ది ప్యారడైజ్' షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తూనే, మరోపక్క 'బ్లడీ రోమియో' కోసం డేట్స్ అడ్జస్ట్ చేశారట. ఈ సరికొత్త క్లారిటీతో నాని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే, 'ఓజీ 2' కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కాస్త నిరాశచెందుతున్నారు. అయితే సుజీత్ కి వేగం షూటింగ్ ఫినిష్ చేస్తాడనే పేరుంది. నాలుగు నెలల్లో 'బ్లడీ రోమియో' షూటింగ్ పూర్తి చేసి, నవంబర్ నాటికి 'ఓజీ 2' ప్రాజెక్ట్ పైకి వచ్చినా ఆశ్చర్యంలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
![]() |
![]() |