![]() |
![]() |
.webp)
సంగీతం.. అప్పుడే తల్లి కడుపులో నుంచి బయటకి వచ్చిన పిల్లలు సంగీతం నుంచి వచ్చే మధురమైన వాయిద్యానికి 24 క్యారెట్ స్వచ్ఛతతో కూడిన ఆనందంతో కాళ్ళు, చేతులు ఆడిస్తారు. అది దేవుడు సైతం పరవశించి నృత్యం చేస్తాడనే నానుడి సైతం ఉంది. సంగీతానికి అంతటి మహత్తరమైన శక్తి ఉంది.
ఇప్పుడు సినీ సంగీత రంగంలో సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే కాకుండా, భారతీయ చలనచిత్ర రంగంలోనే ప్రస్తుతం ఒకే ఒక్కడి పేరు మార్మోగిపోతోంది. ఆ పేరే 'రాక్‌స్టార్' అనిరుధ్ రవిచందర్(Anirudh ravichandar). తన ఎలక్ట్రిఫయింగ్ ట్యూన్స్, థియేటర్లని షేక్ చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మనిషి చూడటానికి ఎంతో సన్నగా, సాధారణంగా కనిపిస్తాడు కానీ, అతను ఇచ్చే మ్యూజిక్ మాత్రం బాక్సాఫీస్‌ని రఫ్ఫాడిస్తుంది. కేవలం పాటలతోనే కాకుండా, థియేటర్లలో రీ-రికార్డింగ్ ద్వారా గూస్‌బంప్స్ తెప్పించడంలో అనిరుధ్ స్టైలే వేరు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర హీరోలు, స్టార్ డైరెక్టర్లు తమ చిత్రాలకు అనిరుధ్ ఖచ్చితంగా ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే అనిరుధ్ మార్కెట్ వాల్యూ ఊహించని స్థాయికి చేరుకుంది.
ఇటీవలి కాలంలో అనిరుధ్ అందుకుంటున్న పారితోషికం ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ #AA23 కోసం అనిరుధ్ ఏకంగా 25 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది. ఒక భారతీయ సంగీత దర్శకుడికి ఈ స్థాయి పారితోషికం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ భారీ డీల్‌తో అనిరుధ్ రవిచందర్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నంబర్ వన్ మ్యూజిక్ కంపొజర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మొత్తం టాలీవుడ్, కోలీవుడ్‌లోని చాలా మంది టైర్-2 హీరోల పారితోషికం కంటే కూడా చాలా ఎక్కువ కావడం విశేషం.
ఈ సరికొత్త రికార్డు అనిరుధ్ గత ప్రాజెక్టుల కంటే భారీ జంప్‌ను సూచిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' కోసం అనిరుధ్ సుమారు 18 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఆ లెక్కన చూసుకుంటే, అల్లు అర్జున్ సినిమాకు అతను తీసుకుంటున్న పారితోషికం దాదాపు 39 శాతం పెరిగింది. ఇతర దిగ్గజ సంగీత దర్శకుల రెమ్యునరేషన్‌తో పోల్చినా అనిరుధ్ రేంజ్ స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకి ;పెద్ది' కోసం రెహమాన్ సుమారు 8 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ ఉంది. ఈ లెక్కన అనిరుధ్ ఫీజు రెహమాన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది.
తెలుగు మార్కెట్లో కూడా అనిరుధ్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' కోసం అనిరుధ్ దాదాపు 15 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'ఆయా షేర్' అనే ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఒకప్పుడు 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాలకు కేవలం ఐదారు కోట్ల లోపే తీసుకున్న అనిరుధ్, ఇప్పుడు తన బ్రాండ్ వాల్యూ15 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్ కి పెంచేసాడు. మ్యూజిక్ రైట్స్ మార్కెట్ బిజినెస్ ఎలా ఉన్నా, అనిరుధ్ పేరు ఉంటే చాలు సినిమాకు వచ్చే క్రేజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా నిర్మాతలు కూడా అతను అడిగినంత ఇచ్చేందుకు వెనకాడటం లేదు.
Also read: Pawan kalyan: మృత్యువుతో పోరాడుతున్న అభిమాని వద్దకు పవన్ కళ్యాణ్.. అడ్డుకుంటారా!
భవిష్యత్తులో అనిరుధ్ లైనప్ చూస్తే ఈ మార్కెట్ మరింత అన్‌స్టాపబుల్‌గా మారేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అతని చేతిలో 'జైలర్ 2', 'ది ప్యారడైజ్' 'థలైవర్ 173' వంటి భారీ సౌత్ ప్రాజెక్టులతో పాటు, షారుఖ్ ఖాన్ 'కింగ్' మూవీ కూడా ఉంది.
.webp)
![]() |
![]() |