![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పరిచయమైనా జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వజ్ సినిమాల మీద సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ఆస్క్ మీ ఏ క్వశ్చన్ " అనేసరికి నెటిజన్స్ చాలామంది చాల ప్రశ్నలే అడిగారు. "మేడం మీకు ఇష్టమైన ఏదైనా క్యారెక్టర్ గుండు చేయించుకోవాలి అని డిమాండ్ చేస్తే మీరు చేయించుకుంటారా " అని అడిగారు ఒక నెటిజన్. "లేదు నేను చేయించుకోను. నటన ఇష్టం ఫ్యాషన్ ఉంది కానీ నా పరిధి దాటి పర్సనల్ గా ఎక్స్పీరిమెంట్ చేయను " అని చెప్పింది జ్యోతి పూర్వాజ్. "కిల్లర్ మూవీ విఎఫ్ఎక్స్ ఎడిట్స్ లో ఉంది .
అది చాలా టైం తీసుకుంటుంది కొంచెం టైం పడుతుంది." "టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకే హీరోతో చేయాలనుకుంటున్నారు " "పవన్ కళ్యాణ్ గారితోనే నటించబోతున్న" అని చెప్పింది. "నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ" అని అడిగేసరికి "ఓజి మూవీలోని ఇన్ ది స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్ " అనే సాంగ్ పెట్టింది. "మీరు ఓజి 2 లో నటిస్తున్నారా " "ఏమో " అని చెప్పింది. "లవ్ , అటాచ్మెంట్ మీ దృష్టిలో ఏంటి " "అటాచ్మెంట్ లో గ్రోత్ ఉండదు డిపెండెన్సీ ఉంటుంది.
లవ్ లో అలా ఉండదు. లవ్ అంటే కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎగరడానికి రెక్కలు ఇస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఎంచుకున్న దారిలో ప్రయాణించేలా ప్రేమ ప్రోత్సహిస్తుంది " అని చెప్పింది. "మాయ అనే మైక్రో మూవీలో ఎక్కువగా రొమాన్స్ లేదు ఎందుకు " "రొమాన్స్ కోసమో ఇంటిమసీ కోసమో మైక్రో ఫిలిమ్స్ తీయడం లేదు. లాంగ్ రన్ లో నిలబడడానికి అన్ని రకాల ఎమోషన్స్ ని అందించడానికి ఆడియన్స్ కి ఏది ఇష్టమో అది అందించడానికి " అని చెప్పింది. "పూర్వజ్ అన్నలో మీకు ఇష్టమైనది ఏంటి అతని కథలా అతని మనసా " "అతను సినిమాల కోసమే పుట్టాడు. మాస్టర్ పీస్ మూవీ విఎఫ్ ఎక్స్ లో ఉండగా కిల్లర్ మూవీ స్టార్ట్ చేసాడు. అది కూడా ఇప్పుడు విఎఫ్ ఎక్స్ లో ఉండగా ఇప్పుడు మైక్రో మూకీ మూవీస్ స్టార్ట్ చేసాడు. అతని సినిమాలోనే జీవిస్తాడు చాలా డెడికేటెడ్. " అని చెప్పింది.
![]() |
![]() |