Home  »  News  »  Varanasi: వారణాసికి బడ్జెట్ కష్టాలు.. ఓటీటీ దిగ్గజాల షాకింగ్ నిర్ణయం!

Updated : Jun 15, 2026

 


ఇండియన్ సినిమా గొప్పతనాన్ని వరల్డ్ సినిమాకి పరిచయం చెయ్యబోతున్న మూవీ  ‘వారణాసి’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రచార చిత్రాలతో   ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటూ ఉంది.  ప్రస్తుతం ఈ భారీ కాన్సెప్ట్ చుట్టూ ఒక ఊహించని ఆర్థిక ఇబ్బంది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రారంభంలో అనుకున్న ఆర్థిక ప్రణాళికలు, అప్పటి ఓటీటీ మార్కెట్ క్రేజ్ ని  బట్టి డిజైన్ చేయబడ్డాయి. ఆ సమయంలో ఇటువంటి భారీ చిత్రాల డిజిటల్ రైట్స్ కోసం స్ట్రీమింగ్ దిగ్గజాలు ఏకంగా  500 కోట్ల నుండి 600 కోట్ల వరకు చెల్లించడానికి వెనుకాడేవి కావు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ తమ వ్యాపార శైలిని పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు తలకిందులు కావడంతో, ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు కొత్త అగ్రిమెంట్ల విషయంలో చాలా సెలెక్టివ్‌గా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఎంతటి క్రేజీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ అయినా సరే, ఇప్పుడు ఓటీటీ రైట్స్ కేవలం 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల రేంజ్‌లోనే ముగిసిపోతున్నాయి. ఒకప్పుడు ఆశించిన  600 కోట్ల భారీ బిజినెస్ కాస్తా ఇప్పుడు గణనీయంగా తగ్గిపోవడంతో, మేకర్స్‌కి  పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అకస్మాత్తు మార్పుల వల్ల బడ్జెట్ రికవరీ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.


Also read: Directors: డైరెక్టర్ల బ్రాండ్ పవర్.. హీరోల కంటే వాళ్ళకే క్రేజ్

ఈ ఓటీటీ సంక్షోభం కారణంగా బడ్జెట్ మరింత పెరగకుండా ఉండేందుకు రాజమౌళి టీమ్ సరికొత్త ప్లాన్స్‌ను సిద్ధం చేస్తోందని సమాచారం. విజువల్ క్వాలిటీ ఎక్కడా తగ్గకుండానే, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాల వైపు వారు మొగ్గు చూపుతున్నారనేది టాక్. షూటింగ్ షెడ్యూల్స్‌లో అవసరమైన మార్పులు చేస్తూ ఖర్చులను నియంత్రించే పనిలో పడ్డారు. మరోవైపు, ఈ సినిమా కోసం మహేష్ బాబు తన కెరీర్‌లోనే అత్యధికంగా మూడేళ్ల ఒప్పందానికి గాను ఏడాదికి50 కోట్లు చొప్పున మొత్తం  150 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం ముందస్తుగా ఎలాంటి ఫిక్స్‌డ్ శాలరీ తీసుకోకుండా, సినిమా లాభాల్లో 50 శాతం వాటా తీసుకునే లాభాల భాగస్వామ్య పద్ధతిని పాటిస్తున్నారు. ఒకవేళ బడ్జెట్ కంట్రోల్ తప్పితే రాజమౌళి తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027 ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న ఈ గ్లోబల్ వండర్, ఈ ఓటీటీ సవాలును అధిగమించి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. కె  ఎల్ నారాయణ నిర్మిస్తుండగా  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్స్ .

  

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.