Home  »  News  »  బాక్సాఫీస్ షేక్ చేయడానికి వస్తున్న 'కాంచన-4'.. భారీ ట్విస్ట్‌తో లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ!

Updated : Jun 13, 2026

 

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హారర్-కామెడీ ఫ్రాంచైజీగా 'ముని' సిరీస్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ సిరీస్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. తాజాగా ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిరీస్‌లో భాగంగా వస్తున్న 'కాంచన-4' చిత్రం గురించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార రంగంలోకి దిగినట్లు సమాచారం.

దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ తాజా పార్ట్ కోసం అదిరిపోయే స్కెచ్ వేశారని తెలుస్తోంది. సినిమాలో అత్యంత కీలకమైన, కథను మలుపు తిప్పే ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం నయనతారను సంప్రదించగా.. ఆమెకు స్క్రిప్ట్ తో పాటు తన క్యారెక్టరైజేషన్ బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ హారర్ డ్రామాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ రావడం ఖాయం.

ఈ ప్రతిష్టాత్మక హారర్ ఎంటర్‌టైనర్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు లారెన్స్ ఇప్పటికే ఇద్దరు క్రేజీ హీరోయిన్లను సెట్ చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డేతో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఈ చిత్రంలో ప్రధాన కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడు వీరికి తోడుగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తోడవడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

గతంలో లారెన్స్ తెరకెక్కించిన 'ముని', 'కాంచన', 'గంగ' వంటి చిత్రాలు కమర్షియల్‌గా భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సిరీస్‌కు ప్రధాన బలమైన సీనియర్ నటి కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఈ నాలుగో భాగంలోనూ నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్నారు. వీరికి తోడుగా రీసెంట్ టైమ్స్‌లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్న నటుడు రెడిన్ కింగ్స్లీ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. రాఘవ లారెన్స్ స్వయంగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నయనతార ఎంట్రీ గురించిన లీకులు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్‌తో లారెన్స్ ఎలాంటి హారర్ విందును అందిస్తాడోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనుంది. నయనతార నటిస్తున్న విషయంపై చిత్ర బృందం నుండి త్వరలోనే ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ హారర్ కామెడీ సెన్సేషన్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.