![]() |
![]() |

'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమిళ నటి దీపిక రంగరాజు. ఆ సీరియల్‌లో పోషించిన 'కావ్య' క్యారక్టర్ తో ప్రతి ఇంటికీ ఇలాంటి కూతురు లేదా కోడలు ఉంటే బాగుండు అనేంతలా పాపులారిటీ తెచ్చుకుంది. తెరపై ఎంతో హుందాగా, ఆనందంగా కనిపించే ఈ సెలబ్రిటీల నిజ జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఉండవనేది చేదు నిజం. తాజాగా గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, తనకున్న ఒకే ఒక్క చివరి కోరిక గురించి దీపిక రంగరాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆమె మాట్లాడుతు ప్రస్తుతం టాప్ రేటింగ్‌లో ఉన్న సీరియల్ లీడ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నప్పటికీ, నాకు చెన్నై నగరంలో కనీసం సొంత ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చింది. దీంతో 'మీరు ఇన్నేళ్లుగా నటిస్తున్నారు కదా, మరి సొంత ఇల్లు ఎందుకు లేదు?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ ప్రపంచంలో మనం జన్మించినప్పుడే భగవంతుడు లేదా ప్రభుత్వం మనకంటూ ఒక స్థలాన్ని ఖచ్చితంగా కేటాయించి ఉంటుంది. అది మరేదో కాదు మనం చనిపోయిన తర్వాత స్మశానవాటికలో లభించే ఆ ఆరు అడుగుల నేల మాత్రమే. మనిషి బ్రతికున్నంత కాలం ఎన్ని కలలు కన్నా, చివరికి శాశ్వతంగా మనకంటూ మిగిలేది ఆ ఆరడుగుల స్థలం మాత్రమే.
Also read: Governor: 50 రూపాయలకే బాల్కనీ టికెట్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన మేకర్స్
నేను ఇండస్ట్రీలో కోట్లకు కోట్లు సంపాదించడం లేదు. కేవలం వేలు, లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకుంటున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు సంపాదిస్తున్న రేంజ్‌లో సంపాదించి ఉంటే చెన్నైలో సొంత ఇల్లు కొనేదానినని, కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సాధారణ మధ్యతరగతి స్థాయి నుండి వచ్చిన నేను అంత బడ్జెట్ భరించలేకపోతున్నాను. ప్రస్తుతం చేతి నిండా సంపాదన ఉన్నా, ఒకసారి పెద్ద మాల్‌కి వెళ్లి షాపింగ్ చేసినా, కొద్దిగా బంగారం కొనుగోలు చేసినా బ్యాంక్ బ్యాలెన్స్ 'జీరో' అయిపోతుంది. డబ్బు కంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని లక్షలు ఉన్నా ఖర్చు పెడితే కరిగిపోతాయి. కానీ మనకు ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా బాధను పంచుకోవాలనుకున్నప్పుడు తోడుగా నిలబడేందుకు మనుషులు మాత్రమే కావాలని నమ్ముతానని చెప్పారు.
![]() |
![]() |