![]() |
![]() |

విమల్ కృష్ణ(Vimal Krishna)దర్శకత్వంలో వచ్చిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద సెట్ చేసిన ట్రెండ్ తెలిసిందే. తనదైన మార్క్ కామెడీ తో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు విమల్ కృష్ణ నుండి వస్తున్న సరికొత్త ప్రాజెక్ట్ పేరు అనుమానపక్షి. ఎ సైక్ ఖాస్టిక్ కామెడీ అనేది టాగ్ లైన్. ఈ మేరకు రీసెంట్ గా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు టీజర్ రిలీజ్ చేసారు.
ఈ టీజర్ కథాంశాన్ని గమనిస్తే, హీరో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ, ప్రతి ఒక్కరినీ అమితంగా అనుమానించే ఒక విచిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తనను కన్న తల్లిదండ్రులను సైతం అనుమానిస్తూ అతను చేసే పనులు, దానివల్ల అతని జీవితంలో ఎదురైన తీవ్ర పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా కథ సాగుతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. హీరో అనుమానపు బుద్ధితో విసిగిపోయిన తల్లిదండ్రులు, అతనికి పెళ్లి చేసి ఇల్లు దాటించాలని చూసే సీన్లు టీజర్ ప్రారంభంలోనే 100 శాతం వినోదాన్ని పంచుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో అతని జీవితంలోకి హీరోయిన్ ప్రవేశించడం, అతని ఎక్సెంట్రిసిటీని భరిస్తూ ప్రేమించడం వంటి సీన్లు యూత్‌ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
నటుడు అజయ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇవ్వడం, సీనియర్ నటి రాశి కథలోకి రావడంతో సినిమా ఒక్కసారిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లోకి మారుతుంది. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జతగా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు విమల్ కృష్ణ మరోసారి తన మార్క్ హిలేరియస్ నరేషన్‌తో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also read: ఆరుగురు పిల్లల స్టార్ హీరోతో అఫైర్.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకి తల్లైన టాలీవుడ్ హీరోయిన్
. ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, సుప్రీత్ మరియు సలీం ఫేకుగా గుర్తింపు తెచ్చుకున్న మస్త్ అలీ ఇతర రోల్స్ . చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు రాజీవ్ చిలక, మేఘా చిలక, స్నేహ రాజేష్ జగ్తియాని, విహాన్ దాండ్, శ్రీచరణ్ మర్నేని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, భరత్ లక్ష్మిపతి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ టీజర్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.

![]() |
![]() |