Home  »  News  »  Akhil: లెనిన్ ఆంధ్ర బిజినెస్ క్లోజ్.. షాకింగ్ రేట్!

Updated : Jun 9, 2026

 

 

అఖిల్(AKhil)అక్కినేని అప్ కమింగ్ మూవీ  'లెనిన్'(lenin).. ఈ మూవీతో అయినా అఖిల్ ఎంటైర్ తన కెరీరి లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలనే ఆశ అక్కినేని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లోను ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు చూస్తుంటే బ్లాక్ బస్టర్ కి వంత పాడుతున్నట్టుగానే ఉన్నాయి. అందుకే బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాల్లో ఊహించని రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది.

 తాజాగా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కుల డీల్ అధికారికంగా ముగిసినట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని మినహాయించి, మిగిలిన ఆంధ్ర రీజియన్ థియేట్రికల్ హక్కులు దాదాపు 9 కోట్ల రూపాయల భారీ రేషియోలో క్లోజ్ అయినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అఖిల్ గత చిత్రం 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, 'లెనిన్'పై బయ్యర్లకి ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ సరికొత్త మాస్ మేకోవర్, కంటెంట్ లోని బలం వల్లే ఆ స్థాయి మార్కెట్ ఏర్పడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు మురళి కిషోర్ రాసుకున్న పవర్ ఫుల్ స్క్రిప్ట్ బయ్యర్లని ఎంతగానో ఆకట్టుకుందనేది కూడా మరో   టాక్.

ఊరమాస్ ప్రేమకథగా తెరకెక్కుతున్న లెనిన్ లో అఖిల్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జత కడుతుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. థమన్ అందిస్తున్న మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద ప్లస్ కానుందని ఇప్పటికే విడుదలైన పాటలు నిరూపించాయి. రాయలసీమ హక్కులకి  కూడా భారీ రేట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కథాంశం రాయలసీమ నేపథ్యంతో కూడుకున్నదనే కావడంతో  అక్కడ బిజినెస్ మరింత హాట్ కేకులా మారే అవకాశం ఉంది.


Also read: Peddi: పెద్దిపై అమితాబచ్చన్ వైఫ్ జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు.. సపోర్ట్ చేసినట్టేనా! లేదా!


నైజాం  విషయానికి వస్తే, అక్కినేని నాగార్జునకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సొంత డిస్ట్రిబ్యూషన్ పైనే భారీ ఎత్తున రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అఖిల్ అక్కినేని తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక పక్కా కమర్షియల్ మాస్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని  అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. జూన్ 26 రిలీజ్ డేట్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,మనం ఎంటర్‌ప్రైజెస్ పై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.