Home  »  News  »  Peddi: ఇలా చేస్తే ఏ సినిమా అయినా హిట్ అంటున్న చరణ్.. స్టేజ్ పైన  మీసం మెలేసాడు

Updated : Jun 8, 2026

 

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో  మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'(Peddi)బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 292 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లని  సాధించింది. ఐదో రోజు నాటికి విజయవంతంగా . 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం  హైదరాబాద్‌లో చిత్ర బృందం  'థాంక్యూ ప్రెస్ మీట్' నిర్వహించింది. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు, ఆయన చూపించిన ఎనర్జీ ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతున్నాయి.

చరణ్ మాట్లాడుతు అసలు ఎక్కడి నుంచి మాట్లాడాలో అర్థం కావడం లేదు. నిన్న రాత్రి థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడకపోయి ఉంటే, ఈరోజు ప్రెస్ మీట్‌లో ఇంకా బెటర్ గా మాట్లాడేవాడిని. థియేటర్‌లో ప్రేక్షకులు హంగామా చూశాక మాటలు రావడం లేదు. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ అంటే సాధారణంగా ఆడియన్స్ సైలెంట్‌గా ఉంటారని అనుకున్నాను. కానీ అక్కడ కూడా ప్రేక్షకులు మాస్ థియేటర్లయిన శ్రీరాములు, భ్రమరాంబ థియేటర్ల తరహాలో ఈలలు, గోలలతో పండగ చేసుకున్నారు. పెద్దిని ఇంతలా ఆదరించినందుకు మీడియా మిత్రులకి ,ప్రేక్షకులకి, అభిమానులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నప్పటికీ, 'పెద్ది' సినిమా తన లైబ్రరీలోనే నెం. 1 లేదా నెం. 2 స్థానంలో నిలిచిపోయే చిత్రం.ఈ కథ చాలా రిస్క్‌తో కూడుకున్నదని మొదటి రోజే నాకు అర్థమైంది. అయితే మనస్ఫూర్తిగా, సిన్సియారిటీతో పని చేస్తే ఖ  చ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మాను. అదే నిజమైంది. ఈ సినిమా చేయడానికి నన్ను  ఎవరూ బలవంతం చేయలేదు. నేనే  స్వతహాగా కథని ఇష్టపడి, దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభని  నమ్మి  చేశాను. అందుకే ఈ సక్సెస్ నాకు  ఎంతో సంతృప్తిని ఇచ్చింది. 


Also read: Peddi: పెద్దికి నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి థాంక్స్.. వైరల్ అవుతున్న జగపతిబాబు వ్యాఖ్యలు 


జగపతిబాబు గారి పెర్ఫార్మ్ చూసి నా కంట్లో నీళ్లొచ్చాయి. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ గారి సపోర్ట్‌తో పాటు తోటి నటీనటులకి థాంక్స్. దాదాపు 185 రోజుల షూటింగ్‌లో ఆల్మోస్ట్ అన్ని రోజులూ సెట్‌లోనే ఉండి సినిమాని  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన నిర్మాత సతీష్ కిలారు, మైత్రీ రవిశంకర్‌కి  ప్రత్యేక ధన్యవాదాలు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాసిన అద్భుతమైన పాటలు ఎప్పటికీ తన పర్సనల్ లైబ్రరీలో ఉంటాయి. 'పెద్ది'కి  సిన్సియారిటీ చాలా అవసరం  ప్రేక్షకులు కూడా అంతే సిన్సియారిటీతో థియేటర్లకి  వచ్చి  300 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా మార్చడం ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణమని రామ్ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు. యాంకర్ స్రవంతి కోరిక మేరకు చరణ్ మీసం మెలేసి అభిమానులని  ఊర్రూతలూగించారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.