Home  »  News  »  Peddi: పెద్దికి నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి థాంక్స్.. వైరల్ అవుతున్న జగపతిబాబు వ్యాఖ్యలు 

Updated : Jun 8, 2026

 

అప్పలసూరిగా పెద్ది(Peddi)లో జగపతిబాబు పెర్ఫార్మ్ కి మంచి పేరు వస్తుంది. చరణ్ పెర్ఫార్మ్ తర్వాత జగపతిబాబు పెర్ఫార్మ్ నే పెద్దిని సూపర్ హిట్ చేసిందనే అభిప్రాయాన్ని కూడా మెజారిటీ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మీడియాతో  పెద్ది థాంక్ యూ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చరణ్ తో జగపతి బాబు, దర్శకుడు బుచ్చిబాబుతో పాటు నిర్మాతలు బాగున్నారు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతు మూవీలో పెద్ది గెలవడం కోసం ఎలా ఆడాడో,  పోరాడాడో, రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆడాల్సి వస్తుంది. పోరాడాల్సి వస్తుంది.  కానీ గెలిచాడు. కొంచం అటు ఇటు అయితే పెద్దిని తిప్పి కొట్టేవారు. కానీ కి ఒక మైండ్, హార్ట్, దమ్ము మీద ఆడుతుంది. హీ మాన్  చరణ్ భుజాల మీదనే కాకుండా నెత్తిన పెట్టుకొని మూవీని మోశాడు. పెద్ది నాలుగు రోజులు అయ్యింది పుట్టి. కాబట్టి ఇప్పుడిపుడే పాకుతుంది, నడుస్తుంది. త్వరలోనే ఎగురుతుంది. పెద్దిని మనమందరం ఇంకా పెంచాలి.  నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి థాంక్స్. వాళ్ళు అలా రాయడం వల్ల పెద్దికి ఇంకా హైప్ వచ్చింది.

Also read: తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడా!


ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ అద్భుతమైన క్యారక్టర్ పెద్దితో  వచ్చింది. అది నాకు ఇష్టమైన చరణ్ తో. చిరంజీవి గారు పెద్ది మూవీ గురించి పొగుడుతూ నన్ను తన బ్రదర్ అని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.