Home  »  News  »  LB SRIRAM: ఎల్బీ శ్రీరామ్‌కి అవమానం.. షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి కారణం ఇదే

Updated : Jun 6, 2026

 

అప్పుల అప్పారావు మూవీలో 'అప్పు'డే తెల్లారిందా అనే చమక్కుతో కూడిన డైలాగ్ అయినా, హిట్లర్ లో అంతొద్దు..ఇది చాలు అనే స్మాల్ పవర్ ఫుల్ డైలాగ్ రాయాలన్నా  అది ఎల్ బి శ్రీరామ్(Lb Sriram)కే సాధ్యం. నటుడుగా కూడా కామెడీ, సెంటిమెంట్ తో కూడిన క్యారెక్టర్స్ చేసి బహుముఖ ప్రజ్ఞాశీలిగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 40కి పైగా సినిమాలకి  అద్భుతమైన డైలాగ్స్ అందించి, నటుడిగా 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన హఠాత్తుగా వెండితెరకి   దూరమయ్యారు? ప్రస్తుతం యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్  తీస్తున్నారు? ఈ విషయాలపై ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, తనను కలచివేసిన సంఘటనలను ఎంతో ఆవేదనతో పంచుకున్నారు.

నా సుదీర్ఘ కెరీర్‌లో అత్యుత్తమ నటనకి  ఐదు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులని  అందుకున్నాను. కానీ పరిశ్రమ ఒకే రకమైన క్యారెక్టర్స్ కే  పరిమితం చేసింది.  టాలీవుడ్‌లో టాప్ 10 కమెడియన్లలో ఒకరిగా నిలిచి, ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేసి మెప్పించినా కేవలం సెంటిమెంటల్, సానుభూతి లేదా ఏడిపించే వాటికే  పరిమితం చేశారు.. తనలోని నటుడిని, కళాకారుడిని కేవలం ఒకే రకమైన భావోద్వేగాల పరిధిలో ఉంచడం ఇష్టం లేకే సినిమాలని తగ్గించుకున్నాను. సినిమా రంగంలో  రంగులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాలు లేదా క్రికెట్ కంటే కూడా విపరీతమైన స్పందన సినీ పరిశ్రమలోనే కనిపిస్తుంది. కెరీర్ తొలినాళ్లలో ఒక పెద్ద సినిమాకి డైలాగ్ రైటర్‌గా రాత్రింబగళ్లు ఏడాది పాటు కష్టపడినా, కనీసం టైటిల్ కార్డ్స్‌లో నా పేరు కూడా వేయలేదు. ఆ సంఘటన నన్ను వ్యక్తిగతంగా ఎంతో కదిలించింది.


Also read: PEDDI vs DRISHYAM 3: ఎవరు ఎవర్ని దెబ్బ కొడుతున్నారు

అయినప్పటికీ జీవితంలో వైరాన్ని శాశ్వతం చేసుకోకూడదనేది నా తత్వం.పేజీ తిప్పేసి ముందుకు సాగాలని నమ్ముతాను. ఎంత కోపం వచ్చినా అది తాటాకు చప్పుడు లాంటిదే, తప్పు అవతలి వారిదైనా నేనే ముందుగా పలకరిస్తాను. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నటుడిగా ప్రోత్సహించారు. ఇప్పుడున్న జెన్ జీ (Gen Z) తరం స్పీడ్‌ని  అందుకోవడం చాలా కష్టంగా ఉంది. నేటి కామెడీ పోకడలు విచిత్రంగా మారాయి. జోక్ ఏంటో అర్థం చేసుకునేలోపే బ్యాక్ గ్రౌండ్‌లో నవ్వుల శబ్దాలు వచ్చేస్తున్నాయి. దానికి నవ్వాలో లేదో తెలియని పరిస్థితి ఉంది. పెద్ద సినిమాల్లో ఆత్మసంతృప్తి లేకపోవడం వల్లే  'ఎల్బీ శ్రీరామ్ హార్ట్ (Heart) ఫిలిమ్స్' బ్యానర్‌ స్థాపించి, మానవీయ విలువలతో కూడిన షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ నాలోని నటుడిని సంతృప్తి పరుస్తున్నానని చెప్పుకొచ్చాడు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.