Home  »  News  »  Jayam ravi: జయం రవి విడాకుల విషయంలో ట్విస్ట్.. 4 th క్లాస్ లోనే లైంగికంగా వేధించారు

Updated : May 15, 2026

 


ప్రముఖ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ఇద్దరి వైవాహిక బంధం ముగిసిపోవడానికి ప్రముఖ పాప్ సింగర్, స్పిరిచువల్ థెరపిస్ట్ కేనిషా ఫ్రాన్సిస్ కారణమంటూ సోషల్ మీడియా వేదికగా కొంత మంది కేనిషాని విమర్శిస్తూ ట్రోల్స్  చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా కేనిషా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశారు. సదరు వీడియోలో భావోద్వేగంతో మాట్లాడుతు నేను 2013 వ సంవత్సరంలో తల్లిని, 2017లో తండ్రిని కోల్పోయి ఒంటరిగా అనాథగా మిగిలిపోయాను. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే నాలుగో తరగతి చదువుతున్న వయసులోనే సొంత బంధువుల నుండి లైంగిక వేధింపులని  ఎదుర్కొన్నాను. కేవలం 18 ఏళ్లకే,జీవితంపై కనీస అవగాహన లేని వయసులో పెళ్లి చేసుకోవడం వలన తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకి లోనయ్యి గర్భంలోనే బిడ్డను కూడా కోల్పోయాను. జీవితంలో ఇంతటి భయంకరమైన పెయిన్ అనుభవించిన నేను , ఒక తండ్రిని తన పిల్లల నుండి, ఒక అందమైన కుటుంబాన్ని వేరు చేయాలని చూస్తానా.

Also read: Samantha: తెలివిగా తప్పించుకున్న సమంత.. కానీ చరణ్ వల్ల  సమస్య తప్పదా!

 రవి ఏమైనా చిన్న పిల్లాడా, ఎవరితో మాట్లాడాలి, ఎలా బతుకాలో ఆయనకి తెలియదా రవి తన వైవాహిక జీవితంలో తీవ్రమైన మానసిక వేధింపులకి  గురై, ఎమోషనల్‌గా పూర్తిగా కుంగిపోయిన సమయంలో ఒక థెరపిస్ట్‌గా మాత్రమే నన్ను సంప్రదించాడు. మొదట్లో ప్రొఫెషనల్‌గా గైడెన్స్ ఇచ్చినప్పటికీ, ఆయన సమస్యల తీవ్రత చూసి ఆ తర్వాత ఒక మంచి స్నేహితురాలిగా మారాను. నేను  ఎవరి ఇల్లు కూల్చలేదు. ఒకరి సంసారాన్ని ముంచాల్సిన అవసరం లేదు. నెటిజన్లు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై విషం చిమ్మడం ఆపి, సామాన్యుల సమస్యలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం కేనిషా చేసిన ఈ వైరల్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.