![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi). ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలిసి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ 'డ్రైవ్' ప్రోమోను విడుదల చేశారు. జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ఈ చిన్న వీడియో అంచనాలను మరింత పెంచేసింది.
షూటింగ్ ముచ్చట్లు.. సరదా డ్రైవ్!
తాజాగా విడుదలైన ప్రోమోలో రామ్ చరణ్, బుచ్చిబాబు మధ్య ఉన్న స్నేహం, షూటింగ్ సెట్స్‌లోని సరదా వాతావరణం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను ఈరోజే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రోమోలో ట్రైలర్, సినిమా చెప్పిన డేట్ కి పక్కా రిలీజ్ అవుతాయని చెప్పారు. ఇక పూర్తి వీడియోలో ఇంటర్వ్యూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిపారు. సరిగ్గా సినిమా విడుదలకు 20 రోజుల ముందు ఈ వీడియో రావడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
1980ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'పెద్ది' అనే ఒక మట్టి కుస్తీ వీరుడు తన గ్రామం కోసం, తన ప్రత్యర్థులపై చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
'పెద్ది' చిత్రం జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్ షోలతో మొదలై, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా పలు భారతీయ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది.
https://x.com/BuchiBabuSana/status/2055126004184846365
![]() |
![]() |