Home  »  News  »  Peddi: పెద్ది ప్రమోషన్ టూర్ లిస్ట్ రిలీజ్.. ఆసక్తికరంగా మారిన ఆ ఏరియా 

Updated : May 14, 2026

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది' రాక కోసం అభిమానులు, ప్రేక్షకులు ఫుల్ వెయిటింగ్. మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచడంతో సినీ మార్కెట్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. రీసెంట్ గా మేకర్స్ 'పెద్ది పవర్ ప్లే టూర్' (PEDDI Powerplay Tour) పేరిట భారీ ప్రమోషనల్ షెడ్యూల్‌ని  ప్రకటించారు.  


పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది:

మే 18 (ముంబై): గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.  

మే 22 (హైదరాబాద్): ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌కు టీమ్ హాజరు.  

మే 23 (భోపాల్): భారీ మ్యూజికల్ ఈవెంట్.  

మే 24 (బెంగళూరు): ప్రెస్ మీట్ మరియు అభిమానులతో భేటీ.  

మే 28 (ఢిల్లీ): నేషనల్ మీడియా ఈవెంట్.  

మే 30 (చెన్నై): తమిళ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్.  

జూన్ 01 (విజయనగరం): కథా నేపథ్యం ఇక్కడే కావడంతో భారీ ఎత్తున లోకల్ ఈవెంట్.  

జూన్ 02 (హైదరాబాద్): అల్టిమేట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.  

ఇక  ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) అందించిన 'చికీరి చికీరి', 'రై రై రా రా' పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. మూడో సాంగ్ మే 23 న భూపాల్ లో రిలీజ్ కాబోతుంది.


Also read: veerabhadrudu: వీరభద్రుడు డైరెక్టర్ ఆర్ జె బాలాజీ వీడియో లీక్.. కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎవరో తెలుసా  

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'పెద్ది' తో చరణ్ మరోసారి గ్లోబల్ స్థాయిలో తన పవర్ చూపించేందుకు సిద్ధమయ్యాడు . జూన్ 3వ తేదీన వరల్డ్ వైడ్ ప్రీమియర్స్, జూన్ 4న గ్రాండ్ రిలీజ్ ఉండబోతోంది. బుచ్చిబాబు మేకింగ్ స్టైల్, రెహమాన్ మ్యాజిక్, చరణ్ మాస్ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చరణ్ అభిమానులకు ఈ జూన్ నెల అసలైన 'పవర్ ప్లే'ని చూపించబోతోంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.