![]() |
![]() |

తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ (Thalapathy Vijay) పేరే వినిపిస్తోంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్.. తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ కి మీ సలహా ఏంటి? అని మీడియా ప్రశ్నించగా.. కమల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. "విజయ్‌ను కేవలం ఒక సినిమా నటుడిగా మాత్రమే చూడకండి. ఆయనకు ఇంకా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు, అందులో తప్పేమీ లేదు. అయితే, ఆయన మా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రావడం నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది" అని కమల్ పేర్కొన్నారు. ఒక సీనియర్ నటుడిగా, తోటి రాజకీయ నాయకుడిగా విజయ్‌కు కమల్ ఇస్తున్న మద్దతు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా తమిళనాడు కొత్త సీఎం విజయ్ గురించి మీడియా అడగగా.. ఆయన సమాధానం చెప్పకుండా, చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళారు.
![]() |
![]() |