Home  »  News  »  Peddi: పెద్ది చూస్తుంటే ఆ సినిమా గుర్తుకురాకూడదు.. మరి టీం ఏం చేసింది 

Updated : May 13, 2026

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా జరుగుతున్న రికార్డు బిజినెస్ నే అందుకు ఉదాహరణ. మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచడంతో సోషల్ మీడియా కూడా 'పెద్ది' సాక్షిగా కళకళ లాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో పెద్ది ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా(Avinash Kolla)పలు ఆసక్తి కర విషయాలని పంచుకున్నారు.

తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతు  పెద్ది  కుస్తీ నేపథ్యంలో సాగుతుంది. దీంతో కుస్తీ నేపథ్యంలోనే తెరకెక్కిన దంగల్ ని గుర్తు చేయకపోవడమే మా l లక్ష్యం. అందుకే ప్రేక్షకులకి  దంగల్ గుర్తుకు రాకుండా చేయాలని చాలా జాగ్రత్తలు తీసుకొని సెట్స్ వేసాం. దీంతో దంగల్ గుర్తుకు రాదు. మేము పెద్దిలో చేసిన ప్రయోగం అలాంటిది.  నా కెరీర్ లోనే పెద్ది బెస్ట్ స్క్రిప్ట్. ఇలాంటి సినిమాకి పని చేసే అవకాశం రావడం నా అదృష్టమని అవినాష్ చెప్పుకొచ్చాడు.  


Also read: Avatar 3 Fire and Ash: ఓటిటిలోకి అవతార్ 3 .. స్ట్రీమింగ్ డేట్ ఇదే 
  

 దీంతో కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా 'దంగల్' తో పెద్దికి పోలికలు ఉండబోతున్నాయనే న్యూస్ కి బ్రేక్ పడినట్లే. జూన్ 4 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతున్న పెద్ది 1980 వ సంవత్సరంలో  ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ జర్నీ. ఒక సామాన్యుడు తన ఊరి కోసం, తన ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం నేపథ్యంలో జరిగే కథ అని టాక్.

 


  






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.