Home  »  News  »  Sreeleela: శ్రీలీల చెన్నై కోడలు కాబోతుందా? పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Updated : May 12, 2026

తన డ్యాన్స్‌తో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనసు దోచుకున్న టాలీవుడ్‌ యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela).. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందా? చెన్నై కోడలు కాబోతుందా?. తాజాగా తన పెళ్లిపై శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

లేడీ సూపర్ స్టార్
చెన్నైలోని అమృత ఏవియేషన్ కాలేజీ ఈవెంట్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీలీల సందడి చేసింది. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. శ్రీలీలను చూడగానే స్టూడెంట్స్ ఉత్సాహంతో 'లేడీ సూపర్ స్టార్' అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలపై శ్రీలీల చాలా వినమ్రంగా స్పందించింది.

"నాకు ఇష్టమైన నటి నయనతార గారు. ఆమె మాత్రమే అసలైన లేడీ సూపర్ స్టార్. ఆమె నాకు రోల్ మోడల్. ఆ స్థాయికి చేరుకోవడానికి నాకు ఇంకా చాలా సమయం పడుతుంది" అంటూ తనపై వస్తున్న ప్రశంసలకు హుందాగా సమాధానమిచ్చింది శ్రీలీల.

పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఇదే ఈవెంట్ లో పెళ్లి గురించి కూడా శ్రీలీల చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. "చెన్నై కుర్రాళ్లు చాలా స్వీట్. ఇక్కడ మనుషులే కాదు, ఇక్కడి దోశ అంటే నాకు చాలా ఇష్టం. ఇక పెళ్లి విషయానికి వస్తే.. నయనతార గారి లాగే నేను కూడా చెన్నైలోనే పెళ్లి చేసుకుంటానా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను" అంటూ నవ్వుతూ సరదాగా బదులిచ్చింది.

శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. నయన్ లాగే శ్రీలీల కూడా తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకుని చెన్నై కోడలిగా సెటిల్ అవుతుందా? లేక కేవలం సరదాగా ఈ కామెంట్స్ చేసిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.