Home  »  News  »  'వీరభద్రుడు' లాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలడు: హీరో కార్తి

Updated : May 12, 2026

కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) నటించిన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు' (Veera Bhadrudu). త్రిష (Trisha) హీరోయిన్. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం మే 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. తాజాగా మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మూవీ టీమ్ తో పాటు హీరో కార్తి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సుప్రియా యార్లగడ్డ పాల్గొన్నారు.  

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ.. "నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను. నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు… కానీ తెలుగు వారి మనసు మాత్రం నాకు బాగా తెలుసు. సుప్రియ గారితో మాకు ఎప్పటినుంచో చాలా మంచి స్నేహం ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఇంత అద్భుతమైన ప్రమోషన్స్, రిలీజ్ ప్లానింగ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాతో ప్రేక్షకులు ఖచ్చితంగా చాలా సంతృప్తి పొందుతారు. ఆర్.జే. బాలాజీ గారి జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన మల్టీ టాలెంటెడ్. ఈ కథను చాలా సిన్సియర్‌గా రాశారు… అంతే సిన్సియర్‌గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి థియేటర్ మాస్ మసాలా మూమెంట్స్‌తో ఉంటుంది. చాలా మంచి హ్యూమర్, ఫన్ ఉంటాయి… ఇది నా ప్రామిస్. మే 14న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఆర్.జే. బాలాజీ, జీకే విష్ణు కలిసి నన్ను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన నా సినిమాలన్నింటికంటే చాలా డిఫరెంట్‌గా చూపించారు. త్రిషతో 23 ఏళ్ల తర్వాత కలిసి పనిచేసిన సినిమా ఇది. తను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఇది ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్. మీ ఆశీస్సులు, ప్రేమ మాకు కావాలి. మీ అందరి సపోర్ట్‌కి, అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు." అన్నారు.

హీరో కార్తీ మాట్లాడుతూ.. "మీ ప్రేమకి హృదయపూర్వక కృతజ్ఞతలు. షూటింగ్ జరుగుతుండగా ఇక్కడ ‘రోలెక్స్’ ఉన్నారని చెప్పారు. అందుకే హాయ్ చెప్పాలని వచ్చాను. ఈ సినిమా ఫస్ట్ లుక్ నాకు చాలా నచ్చింది. ఇది మాస్ మసాలా అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కూడా చెప్పొచ్చు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. గజని డేస్ గుర్తుకు వచ్చాయి. ఇలాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది. నేను తప్పకుండా తెలుగు వెర్షన్ కూడా చూస్తాను. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే వెంకీతో చేస్తున్న సినిమా కూడా మీ అందరి ప్రేమను అందుకోవాలని ఆశిస్తున్నాను." అన్నారు.

డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "ఒక డివైన్ ఎలిమెంట్‌తో పాటు సోషల్ యాంగిల్‌ను అద్భుతంగా మిక్స్ చేసి ఆర్.జే. బాలాజీ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని చోట్ల పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్.జే. బాలాజీ గారి ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. ఆయన ఆర్జేగా ప్రారంభించి, దర్శకుడిగా, నటుడిగా… ప్రతి పాత్రలోనూ అద్భుతంగా రాణించారు. సూర్య గారిని, కార్తి గారిని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. వాళ్ల సినిమాలు తమిళంలో రిలీజ్ అయితే ఎంత పండగలా ఉంటుందో, తెలుగులో కూడా అంతే పండగ వాతావరణం ఉంటుంది. సూర్య గారు ఎంతో హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో దాదాపు 90 రోజులు పని చేసే అవకాశం వచ్చింది. ఆయన చేసే సమాజ సేవ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా గొప్ప విజయాలు సాధించి, అద్భుతాలు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను." అన్నారు.

డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ మాట్లాడుతూ.. "సూర్య గారి సినిమాలను తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ సినిమాను కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అద్భుతంగా తీర్చిదిద్దాం. దర్శకుడిగా నేను సూర్య గారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఏముంటుందో ట్రైలర్‌లో కొంత మాత్రమే చూపించాం. సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ మాస్ మసాలా ఫిల్మ్. అభిమానులు చూడాలనుకునే సూర్య సార్‌ను ఈ సినిమాలో చూపించాం. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాతో సూర్య గారికి ఒక బ్లాక్‌బస్టర్ ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఖచ్చితంగా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది." అన్నారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "ఇది చాలా అద్భుతమైన ఎమోషన్స్‌తో కూడిన సినిమా. పాటలన్నీ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి. ఈరోజు ఈ వేడుకలో సూర్య గారిని, కార్తి గారిని పక్కపక్కన చూడడం కన్నుల పండుగలా అనిపించింది. సాయి అభ్యంకర్ చాలా అద్భుతమైన సంగీతం అందించారు. బాలాజీ గారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అన్నారు. 

రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ.. "సూర్య గారు హీరోగా వస్తేనే అదరగొడతారు. ఇప్పుడు ‘గాడ్ మోడ్’లో వస్తున్నారు… ఇక ఏ లెవెల్‌లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈరోజుల్లో న్యాయం అనేదే ఒక మిరాకిల్ అయిపోయింది. ఆ మిరాకిల్‌ని చూడాలంటే దేవుడే దిగి రావాలి అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అలా దిగివచ్చిన దేవుడే ‘వీరభద్రుడు’. ఎస్.ఆర్. ప్రభు గారు ‘ఖైదీ’ సినిమాకు నాకు మొదటిసారి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి వరుసగా ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కార్తి అన్న ఎప్పుడూ నాకు సొంత తమ్ముడిలా సపోర్ట్ చేస్తుంటారు. సూర్య అన్న కూడా నాకు సొంత అన్నయ్యలానే. ‘వీరభద్రుడు’ మే 14న మీ ముందుకు వస్తున్నాడు. అందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.

ఫైట్ మాస్టర్ విక్రమ్ మాట్లాడుతూ.. "నేను ‘కాంతార’, ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశాను. నాకు రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సూర్య గారికి ధన్యవాదాలు. సూర్య గారు ఫైట్స్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. రిహార్సల్స్‌కు కూడా ఎంతో క్రమశిక్షణతో ముందుగానే వచ్చేస్తారు. ఆయన మొదటి సినిమాలో ఉన్న ఎనర్జీని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బాలాజీ గారికి థ్యాంక్యూ. టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది." అన్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.