Home  »  News  »  Vijay: 400 మందికి బంగారు ఉంగరాలు పంపిణీ చేసిన విజయ్ 

Updated : May 11, 2026

 

-ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతో సంబరాలు 
-మీ కోసమే పనిచేస్తానని ప్రకటన
-ఈ నేపథ్యంలో 400 మందికి బంగారు ఉంగరాలు పంపిణీ చేసిన న్యూస్ వైరల్ 
-ఆ డీటెయిల్స్ చూద్దాం


తమిళ చిత్ర పరిశ్రమలో ఇళయ 'దళపతి' విజయ్‌(Vijay)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సిఎం పీఠంపై కుర్చోపెట్టింది కూడా సినిమానే అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో వెండితెరపైనే కాదు. రాజకీయాల్లోను నెంబర్ వన్ అనిపించుకున్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. వైరల్ గా మారడమే కాదు ఆ మంచి గుణం ఉంది కాబట్టే విజయ్ ని తమిళ ప్రజలు సిఎం పీఠంపై మొదటి సారే కూర్చోబెట్టారనే కామెంట్స్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. 

అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'బిగిల్'(Bigil)విజయ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన  తర్వాత విజయ్ చిత్ర యూనిట్ మొత్తానికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. దాదాపు 400 మంది టీమ్ సభ్యులకి స్వయంగా బంగారు ఉంగరాలని  బహుమతిగా అందించాడు. ప్రతి ఉంగరంపై 'బిగిల్' అని రాసి ఉండటం విశేషం. సాధారణంగా నిర్మాతలు మాత్రమే ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తుంటారు, కానీ స్వయంగా హీరోనే పెద్ద ఎత్తున ఖర్చు చేసి టీమ్ మొత్తాన్ని సత్కరించడం అప్పట్లో సంచలనంగా మారింది.

Also read: Bharath Kanth: హీరో భరత్ కాంత్ మృతిపై ఊహించని పోస్ట్ చేసిన అషురెడ్డి 

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్పట్లో అధికారికంగా ధృవీకరించింది. "విజయ్ సర్ ఉదారతకు హద్దులు లేవు. ఆయన చేసిన ఈ పని మా యూనిట్ సభ్యులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అప్పట్లో ట్వీట్ చేశారు. కేవలం బిగిల్ మాత్రమే కాదు, 'మెర్సల్', 'సర్కార్' సినిమాల సమయంలో కూడా టీమ్ మెంబర్స్ కి గడియారాలు, ఇతర ఖరీదైన బహుమతులు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. 'బిగిల్' మూవీ తెలుగులో  'విజిల్' గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.