Home  »  News  »  APSFTVTDC చైర్మన్‌గా పి.భరత్ భూషణ్.. అభినందించిన నందమూరి బాలకృష్ణ!

Updated : May 10, 2026

ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమింపబడ్డ భరత్ భూషణ్..  నందమూరి బాలకృష్ణని  కలవగా ఆయన భరత భూష‌ణ్‌కు అభినందనలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో సినీ, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని నందమూరి బాలకృష్ణ సూచించారు

సినిమాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్ భూషణ్. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి అలాగే ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు  ప్రతి సమస్యను తీరుస్తూ వచ్చారు. కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయపరమైన చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి భరత్ భూషణ్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరత్ భూషణ్ గారిని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించడం హర్షించదగిన విషయం. చలన చిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భరత్ భూషణ్ గారిని చైర్మన్ గా నియమించి రాష్ట్రంలో ఈ సంస్థ అభివృద్ధి బాధ్యతలను ఆయనకు అప్పగించడం జరిగింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.