Home  »  News  »  Rowdy Janardhana: ‘రౌడీ జనార్ధన’ బర్త్‌డే బ్లాస్ట్.. లోకాన్నే ఎదిరించే మొండితనం.. ప్రేమకు తలవంచే నైజం!

Updated : May 9, 2026

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ‘రౌడీ జనార్ధన’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదలైంది.

విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘రౌడీ జనార్ధన’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన విజయ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ కూడా వేరే లెవెల్ లో ఉంది. "A man who fights the world.. but surrenders only to love... (ప్రపంచంతో పోరాడే మనిషి... కేవలం ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు) అంటూ మేకర్స్ ఈ పోస్టర్ విడుదల చేయడం విశేషం.

మాస్ లుక్‌లో విజయ్ ఊచకోత!
‘రౌడీ జనార్ధన’ పోస్టర్ లో విజయ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. వర్షంలో తడుస్తూ, పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసం, చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న విజయ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా పోస్టర్‌లో ఒక మహిళ పాదం విజయ్ గుండెలపై ఉన్న తీరు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా అని పోస్టర్ డిజైన్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

‘రౌడీ జనార్ధన’ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

విజయ్ దేవరకొండ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ‘రౌడీ జనార్ధన’తో మళ్ళీ తన సత్తా చాటుతాడని రౌడీ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

 

https://x.com/SVC_official/status/2052971307525087614






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.