Home  »  News  »  NTR: ఎన్టీఆర్ ఆ రోజు చేసిన పని నా జీవితంలో మర్చిపోలేను!

Updated : May 5, 2026

నటుడు, దర్శకుడు రవిబాబు (Ravi Babu) తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే లెజెండరీ నటుడు నందమూరి తారకరామారావు (NTR) తో జరిగిన ఒక మరపురాని సంఘటనను రవిబాబు గుర్తు చేసుకున్నారు.

రవిబాబు తండ్రి, ప్రముఖ నటుడు చలపతిరావు ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తుడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రవిబాబు వాళ్ళ గృహప్రవేశానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఒక సరదా సంఘటనను రవిబాబు పంచుకున్నారు.

సాధారణంగా గృహప్రవేశం అప్పుడు ఆవు, దూడలను ఇంటి లోపలికి తీసుకువెళ్తారు. అయితే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక చిన్న స్లోప్ ఉండటం వల్ల ఆవు లోపలికి రావడానికి మొరాయించిందట. అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఆవు మెడలోని తాడును పట్టుకుని తనదైన శైలిలో "హుమ్!" అని ఒక గంభీరమైన శబ్దం చేస్తూ లాగారట. ఆ గంభీరమైన పిలుపునకు ఆవు ఒక్కసారిగా వేగంగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయిందని రవిబాబు వివరించారు. ఆవు లోపలికి వెళ్లడమే కాకుండా, అక్కడ పేడ వేయడంతో "ఇక అంతా శుభమే జరుగుతుందని" ఎన్టీఆర్ అన్నారట. 

అలాగే, ఆ రోజు పూజారిని పక్కన పెట్టి, ఎన్టీఆరే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించారని రవిబాబు తెలిపారు. అలా ఎన్టీఆర్ తో తనకున్న ఆ మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు.

రవిబాబు పూర్తి ఇంటర్వ్యూతో పాటు, మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

 

https://x.com/Theteluguone/status/2051266348337267064






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.