![]() |
![]() |

ప్రస్తుతం విజయ్(Vijay)అభిమానులు, తమిళనాడు యావత్తు మాత్రమే కాదు ఇండియా మొత్తం మే 4 న జరిగే ఎలక్షన్స్ రిజల్ట్ ఎలా రాబోతున్నాయనే క్యూరియాసిటీ తో ఎదురు చూస్తూ ఉంది. త్రిష కూడా అదే క్యూరియాసిటీ తో ఉంటుందనే వాస్తవం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిష ఎలెక్షన్స్ రిజల్ట్ గురించి ఏమైనా చెప్తుందేమో అని ఎదురుచూస్తున్న వాళ్ళకి, సోషల్ మీడియాకి త్రిష చేసిన షాకింగ్ ట్వీట్ కంటపడింది. మరి ట్వీట్ మ్యాటర్ ఏంటో చూద్దాం
సూర్య(Suriya)తో కలిసి త్రిష(Trisha)చేసిన 'కరుప్పు'(Karuppu)ఈ నెల 14 న రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా త్రిష లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. 37 సెకన్ల నిడివి ఉన్న వీడియో ద్వారా 43 ఏళ్ళ ఏజ్ లో కూడా త్రిష మరోసారి తనదైన స్టయిల్లో మెస్మరైజ్ చెయ్యబోతుందని తెలుస్తుంది. సదరు వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తు కరుప్పులో త్రిష ఉందనే విషయం మర్చిపోయాను. తన ఏజ్ రివర్స్ గేర్ లో వెళ్తుందని ట్వీట్ చేసాడు. త్రిష స్పందిస్తు నేను కూడా కరుప్పులో ఉన్నానని మర్చిపోయాను. వాళ్ళు ఇలాగైనా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది. త్రిష రిప్లైపై సూర్య అభిమాని స్పందిస్తు కరుప్పు ఆడియో లాంచ్ కి రాని మీకు ఇంత వెటకారం అవసరమా అని బదులిచ్చాడు. నా ఇన్విటేషన్ బహుశా మెయిల్ లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందని సదరు సూర్య అభిమానికి త్రిష రిప్లై ఇచ్చింది.
Also read: Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు..ఏ దేశమో తెలుసా!
ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో మేకర్స్ త్రిషకి ఇన్విటేషన్ పంపించకపోవడం ఏంటని త్రిష ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మొన్న ఏప్రిల్ 26 న మదురై వేదికగా ఆడియో లాంచ్ జరగగా త్రిష హాజరు కాలేదు. కరుప్పు తెలుగులో 'వీరభద్రుడు'గా వస్తుంది.
.webp)
![]() |
![]() |