Home  »  News  »  Kara: కర ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ధనుష్ హిట్ కొట్టినట్లేనా!

Updated : May 1, 2026

 

విభిన్న చిత్రాల కథానాయకుడు ధనుష్(Dhanush)నిన్న 'కర'(kara)మూవీతో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ ని కబ్జా చెయ్యడానికి వచ్చాడు. హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా ధనుష్ సరసన ప్రేమలు బ్యూటీ మమితా భైజు కనిపించింది. మొదటి ఆట నుంచే అన్ని చోట్లా  మిక్స్డ్ టాక్ రన్ అవుతుండటం  ధనుష్ అభిమానులని కలవరపరుస్తుంది. మరి ఈ మూవీ నిన్న రాబట్టిన కలెక్షన్స్ ఎంతో చూద్దాం.

కర తొలి రోజు వరల్డ్ వైడ్ గా 9 .14 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సదరు కలెక్షన్స్ లో తమిళనాడు గ్రాస్ 4 .75 కోట్లు, తెలుగు రాష్ట్రాల గ్రాస్ 1 .65 కోట్లు, కర్ణాటక 60 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై లక్షలు, ఓవర్ సీస్ 2 .50 కోట్లు. ఇలా మొత్తం   9 .14 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఇండియా వైడ్ గా చూసుకుంటే 7 .20 కోట్ల గ్రాస్. ఎంటైర్ ధనుష్ కెరీర్ లోనే లోయస్ట్ ఫిగర్. అందుకే ధనుష్ అభిమానులు కలవర పడుతున్నారు.


Also read: jetlee: జెట్లీ హైలెట్స్ ఇవేనంట... నిజమో కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుగా 

అసలు బుకింగ్స్ ఓపెన్ అయిన దగ్గరనుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో 'కర' పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. తెలుగుతో పాటు ఓన్ ఏరియా తమిళనాడులోను అదే పరిస్థితి. సుమారు 25 శాతం ఆక్యుపెన్సీ నే తమిళనాట నమోదయ్యిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా పదేళ్ల క్రితమే రికార్డు కలెక్షన్స్ సాధించిన ధనుష్ కి ఇలాంటి పరిస్థితి అంతుచిక్కని రహస్యల్లో ఒకటిగా మిగిలింది. బహుశా అభిమానులు ఆ రహస్యాన్ని ఛేదించే పనిలో ఉండే ఉంటారు . విగ్నేష్ రాజా(Vignesh Raja)దర్శకత్వంలో 'ఈషారీ కే గణేష్' నిర్మించగా జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు. 
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.