Home  »  News  »  ప్రముఖ హీరోయిన్ పిల్లలకి 30 వేల కోట్లరూపాయిల ఊరట.. కోర్టు సంచలన తీర్పు 

Updated : Apr 30, 2026

 


కొన్ని నెలలుగా ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్(karisma kapoor)ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత సంజయ్ కపూర్(Sunjay Kapoor)ఆస్తి వ్యవహారంలో ఇష్యు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 30,000 వేల కోట్ల విలువైన ప్రాపర్టీలో సంజయ్ కపూర్ మరో భార్య ప్రియా సచ్ దేవ్ అజమాయిషీ ఉండకుండా చేయడంతో పాటు విక్రయించకుండా చూడాలని కోరుతు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో కోర్టు సంచలన తీర్పు వెల్లడి చేసింది. 


సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన ఆస్తుల పంపకంపై నెలకొన్న వివాదాన్ని విచారించిన కోర్టు, ఆస్తుల అన్యాక్రాంతం కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.   సంజయ్ కపూర్ మూడవ భార్య ప్రియా సచ్‌దేవ్ ఆస్తులని విక్రయించడం లేదా ఇతర వ్యక్తులకు బదిలీ చేయకూడదు. సంజయ్ కపూర్‌కు చెందిన భారతీయ కంపెనీలలోని వాటాలు, ఈక్విటీల మార్పులు, విదేశీ బ్యాంక్ ఖాతాల నిర్వహణను నిలిపివేయడంతో పాటు, ఆయన వద్ద ఉన్న క్రిప్టో కరెన్సీ ఆస్తులను విక్రయించవద్దు.ఖరీదైన పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ మరియు ఇతర విలువైన వస్తువులను ఏ విధంగానూ వేరేవారికి బదిలీ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ తీర్పు కరిష్మా కపూర్, ఆయన పిల్లలకి ఊరటనిచ్చినట్లయింది.


Also read: Priyanka Chopra: అందం ఉంటే సరిపోదని ప్రియాంక చోప్రాపై మైక్ విసిరిన మన గురువు గారు


సంజయ్ కపూర్ 2025 జూన్‌లో యూకేలో మరణించిన తర్వాత, ఆయన వీలునామా గురించి వివాదం మొదలైంది. ప్రియా సచ్‌దేవ్  సమర్పించిన వీలునామా నకిలీదని, దాన్ని ఫోర్జరీ చేశారని కరిష్మా పిల్లలు మరియు సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ కోర్టులో వాదించారు. సంజయ్ కపూర్ ఏడాదికి  60 కోట్ల జీతం తీసుకునేవారు. కానీ ఆయన ఖాతాల్లో కేవలం  1.72 కోట్లే ఉన్నట్లు చూపడం వెనుక ఆస్తుల మళ్లింపు జరిగిందని పిల్లల తరపు న్యాయవాదులు ఆరోపించారు. వీలునామాపై అనుమానాలు ఉన్నందున, అది నిజమైనదేనని నిరూపించాల్సిన బాధ్యత ప్రియా దేనని  కూడా కోర్టు పేర్కొంది.కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ ఇద్దరి పెళ్లి 2003 లో జరగగా సమైరా అనే పాప ఖైన్ అనే బాబు ఉన్నారు.

 

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.