![]() |
![]() |

ఇండియన్ సినిమా గొప్పతనాన్ని వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద చాటాలనే లక్ష్యంతో వారణాసి(Varanasi)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సదరు మూవీ మహేష్, రాజమౌళి ల కలల ప్రాజెక్ట్ నే కాదు అభిమానులు, ప్రేక్షకుల కలల ప్రాజెక్ట్ కూడా. దీంతో వారణాసి అప్ డేట్స్ గురించి సెర్చ్ చేయడం అనేది అలవాటుగా మారింది. ఈ క్రమంలో వారణాసి బిజినెస్ విషయంలో రాజమౌళి చేస్తున్న ప్లాన్స్ కి సంబంధించిన న్యూస్ వారణాసి రేంజ్ ని చెప్తుంది.
బాహుబలి సిరీస్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు జపాన్ తో సహా కొన్ని దేశాల్లో మంచి వసూళ్ళని సాధించాయి. ఓవర్ సీస్ అయితే చెప్పక్కర్లేదు. మిలియన్ డాలర్స్ స్వచ్ఛందంగా సరెండర్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా వారణాసికి దక్షిణ అమెరికాతో పాటు లాటిన్ అమెరికా దేశాలపైన గురి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇవే కాదు మరికొన్ని దేశాలలో రిలీజ్ చేయాలనే టార్గెట్ ని కూడా ఫిక్స్ అయినట్టుగా చెప్తున్నారు. వారణాసి కథ పలు దేశాలతో ముడిపడిన సబ్జెట్ కావడం, పైగా మహేష్ ప్రపంచ యాత్రికుడు కావడంతో చాలా దేశాలలో రిలీజ్ చేయాలనేది ప్లాన్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వారణాసి సాధించబోయే రికార్డులు ఊహకి కూడా అందవనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది.
Also read: JD Chakravarthy: మా సినిమా ఆపేయాలని ప్రభుత్వం నుంచి ఫోన్ వచ్చింది
కొన్ని రోజుల క్రితం షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన మేకర్స్ తిరిగి షూట్ ని స్టార్ట్ చేయనున్నారు. తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలోని 'రోస్ ఐస్ షెల్ఫ్' వద్ద ప్లాన్ చేశారు. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి భారతీయ చిత్రంగా కూడా వారణాసి రికార్డు సృష్టించనుంది. ఇటీవల మెక్సికో దేశంలో 'వారణాసి' గ్లింప్స్‌ని ప్రదర్శించారు. ఆ తరహాలోనే బ్రెజిల్ తో పాటు మరికొన్ని దేశాల్లో ప్రచారం చేయనున్నారు.
![]() |
![]() |