![]() |
![]() |

ఇతర భాషా సినీ ప్రేమికులని హిందీ సినీ ప్రేమికులుగా మార్చిన చిత్రం '3 ఇడియట్స్'.(3 idiots) అతను ముందే మరో చిత్రం ఆ ఘనతని సాధించలేదా అంటే చాలా చిత్రాలే సాధించాయి. కానీ సినీ ప్రేమికుల శాతాన్ని పెంచిందని చెప్పవచ్చు. భారతీయ చిత్ర పరిశ్రమకి సరికొత్త స్క్రీన్ ప్లే ని కూడా పరిచయం చేసిన 3 ఇడియట్స్ ఒక తీపికబురుని మోసుకొచ్చింది.
'3 ఇడియట్స్' పార్ట్-2 ఖరారైంది. ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్(Aamir Khan)మాట్లాడుతు మేము 3 ఇడియట్స్ సీక్వెల్ కోసం పని చేస్తున్నాం. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అద్భుతమైన పాయింట్‌ని సిద్ధం చేశారు. కేవలం మొదటి భాగాన్ని కొనసాగించడం మాత్రమే కాదు. అంతకంటే గొప్పగా ఉండబోతోంది. మొదటి భాగం ముగిసిన 10 ఏళ్ల తర్వాత కథ ప్రారంభమవుతుంది. రాంచో, ఫర్హాన్, రాజుల జీవితాలు ఇప్పుడు ఏ మలుపు తిరిగాయి. వారు ఎంచుకున్న మార్గాల్లో ఎలా స్థిరపడ్డారు అనే అంశాలని రెండవ భాగంలో చూపించబోతున్నామని చెప్పుకొచ్చాడు.
Also read: The Paradise: లీకుల దెబ్బకు మేకర్స్ విలవిల.. నాని ది ప్యారడైజ్ సీక్రెట్ విజువల్స్ అవుట్
ఇప్పుడు ఈ మాటలు దశాబ్ద కాలంగా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకి ఆమిర్ ఖాన్ స్వీట్ సుపారీ కంటే తియ్యనైన న్యూస్ చెప్పినట్లయింది. 3 ఇడియట్స్' అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఒక ఎమోషన్. విద్య ఎలా ఉండాలో, ఎలాంటి మార్పులు విద్య వ్యవస్థలో రావాలో అనే పాయింట్ కి ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి తెరకెక్కించారు. అప్పట్లోనే హెవీ అడ్వాన్స్డ్ మూవీ. మరి సీక్వెల్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటుందో చూడాలి. రాంచో గా అమీర్ ఖాన్, ఫర్హాన్ గా మాధవన్, రాజు గా షర్మాన్ జోషి మొదటి పార్టుకి వన్నె తెచ్చిన విషయం తెలిసిందే. సీక్వెల్ వార్తల నేపథ్యంలో '3 ఇడియట్స్ ఈ ప్రపంచానికి అందించిన దివ్య ఔషధం 'ఆల్ ఈజ్ వెల్’ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |