![]() |
![]() |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా జరిగిన ధనుష్ 'కర' (KARA) మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న బుచ్చిబాబు, 'పెద్ది' సినిమా విడుదల తేదీపై ఒక కీలక ప్రకటన చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
'కర' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు బుచ్చిబాబు అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్టేజ్ మీద ఉన్న ఆయనను అభిమానులు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా అప్‌డేట్ కావాలంటూ గట్టిగా అరిచారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని చూసిన బుచ్చిబాబు నవ్వుతూ, "జూన్ 25 పెద్ది వస్తుంది" అంటూ కొత్త విడుదల తేదీని రివీల్ చేశారు.
'పెద్ది' మూవీ జూన్ లో వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కానీ, డేట్ మాత్రం చెప్పలేదు. ఇటీవల జూన్ 25 రావొచ్చు అంటూ వార్తలొచ్చాయి. అయితే అధికారిక ప్రకటన రాకముందే.. ఫ్యాన్స్ ఉత్సాహం చూసి బుచ్చిబాబు డేట్ లీక్ చేయడం విశేషం.
'పెద్ది' సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. .
బుచ్చిబాబు చేసిన ఈ అనౌన్స్‌మెంట్‌తో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జూన్ 25న 'పెద్ది' థియేటర్లలోకి వచ్చి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
మరిన్ని ఆసక్తికర సినిమా అప్డేట్స్ కోసం తెలుగువన్ సినిమా (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
![]() |
![]() |