![]() |
![]() |

తనదైన నటనతో, అందంతో ఒకప్పుడు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి లైలా (Laila). సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్ళీ తెలుగుతెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న 'గోదారి గట్టుపైన' సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో 'ఝాన్సీ' అనే పవర్‌ఫుల్ పాత్రను లైలా పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఆమె ఎంతో హుందాగా, సంప్రదాయబద్ధమైన చీరకట్టులో కనిపిస్తున్నారు. తన నటనతో మరోసారి అందరి మనసు గెలుచుకోనున్నారని ఈ పోస్టర్ తో స్పష్టమవుతోంది.

తెలుగులో లైలా నటించిన చివరి చిత్రం 2004లో వచ్చిన 'మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి'. ఏకంగా 22 ఏళ్ళ తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించడం విశేషం.
అభినవ్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి నేపథ్యంతో సాగే భావోద్వేగపూరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
వేసవి తాపాన్ని తగ్గించే చల్లని గోదావరి గాలిలా ఈ సినిమా రాబోతోంది. 'గోదారి గట్టుపైన' చిత్రాన్ని మే 8న ఘనంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగులో లైలా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఒక గొప్ప ఆరంభాన్ని ఇస్తుందేమో చూడాలి.
![]() |
![]() |