![]() |
![]() |

'వీరసింహారెడ్డి' వంటి భారీ విజయం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ ను వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా 'చందమామ' కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఎంపికైనట్లు తెలుస్తోంది. (NBK111)
నయనతార అవుట్.. కాజల్ ఇన్?
మొదట హిస్టారికల్ జానర్ లో ఈ సినిమాను రూపొందించాలి అనుకున్నారు. ఆ సమయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత జానర్ చేంజ్ అవ్వడంతో, హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య సరసన సరిగ్గా సరిపోయే హీరోయిన్ కోసం వెతికి చివరకు కాజల్ అగర్వాల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
గతంలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన 'భగవంత్ కేసరి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ వెండితెరపై కనిపించనుండటంతో 'సెంటిమెంట్' వర్కవుట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను తొలుత చారిత్రక నేపథ్యంలో ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మార్చారు. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2026 సెకండాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
![]() |
![]() |