![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని గంటలుగా నెలకొన్న ఉత్కంఠకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెరదించారు. పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్నారని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని చిరంజీవి అధికారికంగా ప్రకటించారు.
సర్జరీ సక్సెస్..
పవన్ కళ్యాణ్ హెల్త్ అప్‌డేట్‌ను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "కళ్యాణ్ బాబుకు జరిగిన మెడికల్ ప్రొసీజర్ విజయవంతమైంది. ప్రస్తుతం సురక్షితంగా, నిలకడగా ఉన్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు. సాధారణ స్థితికి చేరుకోవడానికి వారం రోజుల పడుతుందని వైద్యులు తెలిపారు." అని చిరంజీవి రాసుకొచ్చారు.
ఆందోళన వద్దు..
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి భరోసా ఇచ్చారు. "కళ్యాణ్ బాబు ఆరోగ్యం పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు, మీ ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆయనకు మరింత శక్తి, ఉపశమనం కలగాలని, త్వరగా కోలుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం" అని చిరంజీవి ఆకాంక్షించారు.
https://x.com/KChiruTweets/status/2045792321669881890
పవన్ కళ్యాణ్ కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి సర్జరీ జరిగిందని తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేశారు.
![]() |
![]() |