![]() |
![]() |

-200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నమోదైన సంచలనం
-ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో జాక్వెలిన్ పిటీషన్
-నేను అప్రూవర్ గా మారతాను
-ఈడి ఒప్పుకుంటే ఏం జరగబోతుంది
పాన్ ఇండియా రెబల్ స్టార్ 'ప్రభాస్'(Prabhas)తో కలిసి 'సాహో' లో 'బ్యాడ్ బాయ్' సాంగ్ తో తెలుగు నాట బాగా పాపులర్ అయిన భామ 'జాక్వెలిన్ ఫెర్నాండెజ్'(jacqueline fernandez). సదరు సాంగ్ లోని ఆమె కనపరిచిన పెర్ ఫార్మన్స్ కి, స్టెప్స్ కి ఎంతో మంది కలలరాణిగా కూడా మారింది. చాలా రోజుల నుంచి ఈ అమ్మడిని సుకేశ్ చంద్రశేఖర్ కేసు ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి. అదేనండి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేష్. ఇప్పుడు సుఖేష్ కే కాదు విశ్వంలోనే అత్యంత విలువైన సృజనాత్మకత కూడా నా ముందు దిగదుడుపే అని అత్యాధునిక మేధావిగా అందరకి చెప్పుకుంటూ వస్తున్న 'ఏఐ' సైతం షాక్ కి గురయ్యే నిర్ణయాన్ని జాక్వెలిన్ తీసుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం
మనీ లాండరింగ్ కేసులో ఈడి అలియాస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఛార్జి షీట్ లో సుఖేష్ తో పాటు జాక్వెలిన్ నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. నిన్న శుక్రవారం నాడు జాక్వెలిన్ తన న్యాయవాది ద్వారా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను అప్రూవర్‌గా మారి, సుఖేష్ కేసులో తనకు తెలిసిన అన్ని నిజాలని వెల్లడిస్తానని సదరు పిటిషన్ లో తెలిపారు. దీంతో జాక్వెలిన్ విజ్ఞప్తిపై అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ స్పందిస్తు తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి నోటీసులు జారీ చేస్తు తదుపరి విచారణని ఏప్రిల్ 20కి వాయిదా వేశారు.
మరి అప్రూవర్ గా మారితే కేసుకి సంబంధించిన కీలక ఆధారాలని సుకేశ్ సాగించిన అక్రమ లావాదేవీల వివరాలని జాక్వెలిన్ వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు కోర్టు కోరినట్టు ఈ డి కూడా అప్రూవర్ గా మారడానికి ఒప్పుకుంటే జాక్వెలిన్ కి కేసు నుంచి ఉపశమనం లభించనట్లే. నిజానికి గతంలోనే జాక్వెలిన్ తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరినప్పటికీ, కోర్టులు నిరాకరించాయి. దీంతో ఆమె అప్రూవర్‌గా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుకేశ్ తనని తప్పుదోవ పట్టించాడని, అతని నేర చరిత్ర గురించి తనకు తెలియదని ఆమె మొదటి నుంచీ చెప్తూనే వస్తుంది.
also read: Band Melam: బ్యాండ్ మేళం ఓటీటీ డేట్ ఇదే
అసలు కేసు నేపధ్యాన్ని ఒక సారి చూసుకుంటే సుకేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారిగా నమ్మించి ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ నుండి 200 కోట్లు వసూలు చేసినట్లుగా ఈడి నిర్దారించింది. సుకేశ్ ఆ డబ్బుతో జాక్వెలిన్ కి దాదాపు 7 కోట్లు రూపాయల దాకా బహుమతుల రూపంలో ఇచ్చినట్లు ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఆ ఇద్దరు కలిసి క్లోజ్ గా దిగిన పిక్స్ అయితే అప్పుడప్పుడు డల్ గా ఉండే సోషల్ మీడియాకి నూతనోత్సాహ న్ని తీసుకొస్తాయి.

![]() |
![]() |