Home  »  News  »  Ott: ఊహకి అందని తెలుగు ఓటిటి హర్రర్ థ్రిల్లర్.. ఈ నెల 17న మీ కోసమే వస్తుంది

Updated : Apr 14, 2026

 

-రెగ్యులర్ చిత్రాలతో బోర్ కొడుతుందా!
-హర్రర్ థ్రిల్లర్ కావాలా!
-అయితే మీ కోసం రెడీగా వస్తుంది

 
సిల్వర్ స్క్రీన్ లో ప్రదర్శించే సినిమాకి డై హార్ట్ ఫ్యాన్స్ ఎలా అయితే ఉన్నారో, ఓటిటి లో ప్రదర్శించే వెబ్ సిరీస్ కి కూడా డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళరా అని కాదు. వెళ్తారు. దేశంలో మేకర్స్, రైటర్స్ ఎక్కువయ్యారు కాబట్టి ఓటిటి కోసమే నిర్మించే సినిమాలు వస్తున్నాయి. థ్రిల్లర్ కి గురి చేసే కథ, కధాంశంతో క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారు. అందుకే ఓటిటి లవర్స్  నిద్ర లేవడం ఆలస్యం. క్రేజీ ఓటిటి వెబ్ సిరీస్  కోసం వెతికే పనిలో ఉంటారు. పైగా హర్రర్ థ్రిల్లర్ అయితే తెలిసిన వాళ్ళకి కూడా ఫోన్ చేసి చూడమని చెప్పే పరిస్థితి. మరి అలాంటి ఒక హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటిటిలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.

టైటిల్ పేరు పోచమ్మ(Pochamma).. తెలంగాణలోని చాలా పల్లెల్లో పోచమ్మతల్లిని కొలుస్తారు. పేరుకి తగ్గట్టే కధాంశం కూడా పోచమ్మ తల్లి చుట్టూనే తిరగనుంది. ఒక విలేజ్ లో భవననిర్మాణం కోసం పోచమ్మ తల్లి విగ్రహాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత ఆ భవనంలో ఉండే వాళ్ళకి, పోచమ్మ తల్లి విగ్రహం తొలగించామన్న వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు సంభవించాయనే పాయింట్ ఆధారంగా పోచమ్మ తెరకెక్కింది. ఈ మేరకు రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసారు. నిమిషం ముప్పై ఆరు సెకన్ల నిడివి ఉన్నట్రైలర్ చూస్తుంటే  డెవోషనల్ అంశాలతో పాటు లవ్, యాక్షన్, థ్రిల్లర్, భావోద్వేగ అంశాలతో అసలైన సినీ మజాని ఇచ్చేలా ఉంది. ఎర్ర రంగంటే అమ్మకి చాలా ఇష్టం అనే ఒకే ఒక్క డైలాగ్ పోచమ్మ ఉద్దేశ్యాన్ని చెప్తుంది. 

aslo read: Jana nayagan: కేబుల్ టీవీలో జననాయగన్ ప్రసారం.. పళని స్వామినే కారణం 

ఈ నెల 17 న ఆహా(Aha)వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చేస్తుండగా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, శ్రీపూజ, స్నేహాల్,శ్రీ పూజ, విజయ్ సింహ, అచ్యుత్ కీలక రోల్స్ లో చేస్తున్నారు.రమేష్ ఇందిరా(Ramesh Indira)దర్శకుడు కాగా శృతి నాయుడు నిర్మాత. తెలుగు తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.