Home  »  News  »  Allu Arjun: నెంబర్ వన్ కుర్చీపై కన్నేసిన అల్లు అర్జున్.. పక్కా ప్లానింగ్ తో అడుగులు!

Updated : Apr 13, 2026

- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ లైనప్
- అల్లు అర్జున్ ఖాతాలో సెన్సేషనల్ డైరెక్టర్లు!
- విభిన్న జానర్స్ లో భారీ సినిమాలు
- ఒక్కో సినిమాకు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్!

టాలీవుడ్‌లో 'నెంబర్ వన్' రేసు గురించి చర్చ నడుస్తోంది. ఈ జనరేషన్ లో ఆరుగురు టాప్ స్టార్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్. ఒకప్పుడు వీరిలో 'నెంబర్ వన్' ఎవరనేది పక్కన పెడితే.. పాన్ ఇండియా ట్రెండ్ తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. 

'బాహుబలి'తో ప్రభాస్ మొదటి పాన్ ఇండియా స్టార్ గా అవతరించడమే కాకుండా, 'నెంబర్ వన్' అనిపించుకున్నారు. పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టడంలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు మాత్రం పాన్ ఇండియా సినిమాలతో 'నెంబర్ వన్' కుర్చీ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) అందరినీ దాటుకొని నెంబర్ వన్ స్థానాన్ని తన దగ్గరే ఉంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‌లో తన హవాను కొనసాగిస్తున్నారు. 'పుష్ప 2' సృష్టించిన ప్రభంజనం తర్వాత, బన్నీ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా తన ఫ్యూచర్ లైనప్‌ను చూస్తుంటే, టాలీవుడ్‌లో నెంబర్ వన్ కుర్చీని శాశ్వతంగా తన సొంతం చేసుకోవాలనే పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, ఊహించని రేంజ్‌లో పారితోషికాన్ని అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో అల్లు అర్జున్ తదుపరి చిత్రం 'రాకా' (Raaka) గురించిన చర్చ జోరుగా సాగుతోంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కోసం బన్నీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం ఐకాన్ స్టార్ సుమారు 300 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారట. ఒక తెలుగు హీరో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్‌గా మారింది.

కేవలం 'రాకా' మాత్రమే కాకుండా, బన్నీ చేతిలో ఉన్న ఇతర ప్రాజెక్టులు కూడా అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 23వ సినిమాను ప్రకటించారు అల్లు అర్జున్. కేవలం అనౌన్స్ మెంట్ తోనే ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో 'సూపర్ హీరో' కాన్సెప్ట్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు బన్నీ. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేసే అవకాశముంది. ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ వంటి ప్రముఖ దర్శకుల ప్రాజెక్ట్ లు కూడా చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 

విభిన్న దర్శకులతో, విభిన్న జానర్స్ లో సినిమాలు చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ క్రేజీ లైనప్ వెనుక బన్నీ యొక్క దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ఐదేళ్లలో అంటే 2030 వరకు తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఉండేలా, ప్రతి సినిమా ఒకదానికొకటి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ వంటి స్టార్ హీరోల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలో బన్నీ సక్సెస్ అవుతున్నారు.

మొత్తానికి అల్లు అర్జున్ ఎంచుకుంటున్న దర్శకులు, ప్రాజెక్టుల భారీతనం చూస్తుంటే.. ఆయన ఇండియన్ సినిమాలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోల జాబితాలో టాప్‌లో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. 'రాకా' సినిమాతో పాటు బన్నీ నుంచి రాబోయే ఇతర సినిమాలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అల్లు అర్జున్ మార్కెట్ స్టామినా రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.