Home  »  News  »  Shah rukh khan vs ranveer singh: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణవీర్ సింగ్ 

Updated : Apr 11, 2026

 


-ధురంధర్ సిరీస్ విజయాలతో జోష్ లో ఉన్న రణవీర్ 
-ముంబై లో రీసెంట్ గా ఒక పార్టీ 
-రణవీర్, షారుక్ హాజరు 
-పలరించిన షారుక్ 
-రెస్పాన్స్ అవ్వని రణవీర్ 
-సోషల్ మీడియా వేదికగా పలు చర్చలు 
-ఏమైనా విభేదాలున్నాయా!


బడా హీరోలు పబ్లిక్ ఫంక్షన్ లో ఒకరినొకరు ఎదురుపడ్డారే అనుకోండి. ఎంత లేదన్నా సుమారు పది, పదిహేను నిమిషాలైనా మాట్లాడుకుంటారు. ఒక వేళ ఆ ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని అనుకుందాం. మీడియాతో పాటు పబ్లిక్ లుక్ స్ట్రాంగ్ గా ఉండే నేపథ్యంలో అయినా ఆ ఇద్దరు తప్పని సరిగా మాట్లాడుకోవాల్సిందే. అలాంటిది షారుక్ ఖాన్(Shahrukh Khan),రణవీర్ సింగ్(Ranveer Singh)ల నామ్ కే వస్తే పలరింపులు ఇప్పుడు ఇండియన్ సినీ సర్కిల్స్ లో అనేక చర్చలకి దారి తీస్తున్నాయి. సోషల్ మీడియా అయితే ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం.

రీసెంట్ గా ముంబైలో భారీ ఎత్తున ఈవెంట్ జరిగింది. రణవీర్, షారుఖ్ హాజరయ్యారు. రణవీర్ కొంత మందితో మాట్లాడుతుండగా రణవీర్ బుగ్గని షారుక్ తడిమాడు. దాంతో థాంక్స్ చెప్పి రణవీర్ పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క క్లిప్  సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిజానికి ఆ ఇద్దరు కనిపించినప్పుడు ఎంతో బాగా మాట్లాడుకోవాలి. పైగా రణవీర్ ధురంధర్ సక్సెస్ లో ఉన్నాడు. షారుక్ కూడా తన కొత్త చిత్రం 'కింగ్' తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు చాలా సేపు ముచ్చటించుకోవాలి. కానీ అలా జరగకపోవడంతో సోషల్ మీడియాని ఆ ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ బిజీ మోడ్ లోకి తీసుకెళ్లారు. షారుక్ లాంటి సీనియర్ హీరో పలకరిస్తే పట్టించుకోడా, ధురంధర్ విజయంతో రణవీర్ కి తలపొగరు వచ్చిందని,  ధురంధర్ రికార్డ్స్ సృష్టిస్తుంటే ఎదురుగా వెళ్లి పలకరించాలి కదా. అయినా ఇప్పటి వరకు ధురంధర్ సిరిస్ గురించి షారుఖ్ మాట్లాడాడా, అదేనా సీనియర్ అంటే..ఇలా ఇంకా ఎన్నో కామెంట్స్ తో వీకెండ్ కి జోష్ వచ్చింది. 

aslo read: Mangli: సింగర్ మంగ్లీ, డైరెక్టర్ వేణు ఊడుగుల చంపుతామని బెదిరిస్తున్నారు

నిజానికి ధురంధర్ సిరీస్ సక్సెస్ ని పొగుడుతు బాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలు స్పందించారు. కానీ షారుక్  ఖాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్పందించాలని రూల్ ఏమి లేదులే గాని, స్పందించడం అనేది ఎప్పట్నుంచో వస్తున్న సినీ ఆనవాయితీ. షారుక్ నే కాదు సల్మాన్, అమీర్ ఖాన్ కూడా మాట్లాడలేదు. దీంతో ఖాన్ త్రయం ఎందుకు మాట్లాడలేదనే న్యూస్ అయితే ఇప్పటికి మిస్టరీ గానే ఉంది. మరి ఇప్పుడు షారుఖ్, రణవీర్ తాలూకు వీడియో వైరల్ గా మారడంతో షారుక్ తో పాటు సల్మాన్, అమీర్ స్పందిస్తారేమో చూడాలి. షారుఖ్, రణవీర్ కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఒకటుంది.

షారుక్ హిట్ సిరీస్ డాన్ 3 లో రణవీర్ సింగ్ హీరోగా చేస్తున్నాడు. డాన్ పార్ట్ 1 , పార్ట్ 2  షారుక్ వే. మరి స్పెషల్ ఎట్రాక్షన్ గా షారుక్ కనిపించే అవకాశం ఉండవచ్చు. అప్పుడు ఆ ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కి 'వాళ్ళు వాళ్ళు ఒకటేరా' అనుకునే అవకాశం రావచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటి వరకు రణవీర్, షారుక్ మధ్య గొడవలు ఉన్నాయనే ఎలాంటి న్యూస్ కనీసం రూమర్ గా అయినాస్ప్రెడ్ అయిన దాఖలాలు లేవు. 

 

  






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.