Home  »  News  »  Balakrishna: చిన్నారి ప్రాణం కాపాడండి.. నందమూరి బాలకృష్ణ ఎమోషనల్ రిక్వెస్ట్!

Updated : Apr 10, 2026

  • మృత్యువుతో పోరాడుతున్న రెండేళ్ల కేయాన్ష్ 
  • ఆదుకోవాలని పిలుపునిచ్చిన బాలయ్య..

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తనలోని సేవాగుణాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి చలించిపోయారు. అత్యంత ఖరీదైన చికిత్స అవసరమైన ఆ బాలుడిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని బాలయ్య భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.

అసలేం జరిగిందంటే?
హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) ప్రస్తుతం ఒక భయంకరమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నాడు. వైద్యుల పరీక్షల్లో ఆ చిన్నారికి 'స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్ 2' అనే అత్యంత అరుదైన, ప్రాణాపాయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత 21 నెలలుగా ఆ చిన్నారి బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

16 కోట్ల ఇంజెక్షన్ ఉంటేనే ప్రాణం నిలుస్తుంది..
ఈ వ్యాధి నుండి చిన్నారిని కాపాడాలంటే 'AVXS-101' (Onasemnogene Abeparvovec) అనే జీవరక్షక ఔషధం అవసరం. ఇది భారతదేశంలో అందుబాటులో లేదు, విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. ఈ ఒక్క ఇంజెక్షన్ ధర అక్షరాలా 16 కోట్ల రూపాయలు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన నటరాజు దంపతులు అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం అసాధ్యం. నిన్నటి హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణను ఆ కుటుంబం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

బాలయ్య అభయం - ప్రజలకు విన్నపం..
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ, తన వంతుగా వ్యక్తిగత సహాయం చేస్తూనే, ప్రభుత్వ పరంగా కూడా నిధుల సేకరణకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. "ఇంత భారీ మొత్తాన్ని ఆ కుటుంబం ఒక్కటే సమకూర్చుకోలేదు. కావున ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేసి ఆ చిన్నారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుతున్నాను" అని బాలయ్య పిలుపునిచ్చారు.

చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు దాతలు నేరుగా తండ్రి ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు:
అకౌంట్ వివరాలు: 
Account- 8265662545
Name - A S Nataraj
IFSC - IDIB000J028
Branch - J P NAGAR

బాలకృష్ణ చేసిన ఈ విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే పలువురు దాతలు తమ వంతు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఆ రెండేళ్ల చిన్నారి తిరిగి ఆరోగ్యవంతుడై తల్లిదండ్రుల ఒడిలో క్షేమంగా ఉండాలని కోరుకుందాం. 

https://www.facebook.com/share/p/1DxfDmwsxR/






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.